నిరుద్యోగ యువతకు రైల్వేమంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగుల కోసం ఏకంగా 14 వేల ఉద్యోగాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించింది. వీటిల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులతో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ రాతపరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా వున్న 21 ఆర్ఆర్బీలు పరీక్షలను నిర్వహించి నియామకాలను చేపట్టనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్ జోన్ ఉంది. కాగా పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబరు 29న వెలువడే అవకాశం ఉంది.
* మొత్తంగా 14033 పోస్టులకు పరీక్షలు జరుగునుండగా, వీటిలో డిప్లొమా, ఇంజనీరింగ్ వారికే ఏకంగా 13 వేల 34 పోస్టులు వున్నాయి.
* జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేద డిప్లోమా చేసిన అభ్యర్థులు అర్హులు.
* ఇక జూనియర్ ఇంజనీర్ (ఐటీ) క్యాటగిరలో ఖాళీగా వున్న 49 పోస్టులకు పీజీడీసీఏ లేదా బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) లేదా బీసీఏ లేదా బీటెక్ (ఐటీ) లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్) లేదా మూడేళ్ల డీఓఈఏసీసీ 'బి' లెవల్ కోర్సు లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అర్హులు.
* డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ విభాగంలో ఖాళీగా వున్న 456 పోస్టులకు ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా.
* కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ విభాగంలోని 494 పోస్టులకు ఫిజికల్ సైన్స్ డిగ్రీలో కనీసం 45 శాతం మార్కుల వచ్చిన వారు అర్హులు.
* వయోపరిమితి: 01.01.2019 నాటికి 18 - 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
* దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీ, ఎక్స్-సర్వీస్‌మ్యాన్ అభ్యర్థులకు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. (నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు/ యూపీఐ) ద్వారా లేదా ఎస్బీఐ/ పోస్టాఫీస్ చలానా ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు.
* దరఖాస్తు విధానం: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా.
* ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం 02.01.2019
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది 31.01.2019
ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితే 05.02.2019
ఎస్బీఐ/ పోస్టాఫీస్ చలానా ద్వారా 04.02.2019
దరఖాస్తుల తుదిసమర్పణకు చివరితే 07.02.2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more