BJP MP writes to Faizabad DM for house to Ram ‘‘టెంటులో వుంటున్న శ్రీరాముడికి కూడా ఇల్లు ఇవ్వండీ’’

A house for lord ram bjp mp demands home for deity under pm housing scheme

ram mandir, ram temple ayodhya, harinarayan rajbhar, ram house pradhan mantri awas yojana. national politics

BJP MP from Ghosi, Uttar Pradesh, Hari Narayan Rajbhar has demanded that Lord Ram be allotted a house under the Pradhan Mantri Awas Yojana. Why? Because Lord Ram has been 'living in a tent'.

శ్రీరాముడికీ ప్రధాని అవాజ్ యోజన వర్తింపజేయండీ: బీజేపి ఎంపీ

Posted: 12/28/2018 02:52 PM IST
A house for lord ram bjp mp demands home for deity under pm housing scheme

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి ఓటమి పాలైన తరువాత బీజేపి పార్టీ నేతలు అధిష్టానంతో పాటు ప్రధాని నరేంద్రమోడీని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. నితిన్ గడ్కారీ మూడు రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారంటే అందుకు బాధ్యత అధ్యక్షుడిపైనే వుంటుందని పరోక్షంగా బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను టార్గెట్ చేసిన తరువాత.. ఇప్పడు మరో బీజేపి నేత ఏకంగా ప్రధాని మోడీపై తన విమర్శల సంధించారు.

గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపికి మూడింట రెండోంతుల మెజారిటీ రావడంతో ఈ సమయంలో అయోధ్యలో తమ రాముడికి దేవాలయ నిర్మాణం తప్పక జరుగుతుందని భావించిన రామభక్తులు ఇప్పుడు సరిగ్గా 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని డిమాండ్ తో సాధువులు ర్యాలీని నిర్వహించిన వేళ.. బీజేపి మిత్రపక్షాలన్ని కూడా రామమందిర నిర్మాణంపై జోరును పెంచుతున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ నేత వినూత్నంగా నిరసన తెలియజేశారు. శ్రీరాముడు చాలాకాలంగా టెంట్ లో ఉంటున్నారనీ, ఆయనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఓ ఇంటిని నిర్మించాలని బీజేపీ నేత హరినారాయణ రాజ్ భర్ కోరారు. ఈ మేరకు అయోధ్య జిల్లా కలెక్టర్ కు ఆయన లేఖ రాశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని ప్రతీ ఒక్కరికి ఇంటిని నిర్మిస్తామని కేంద్రం చెబుతున్న విషయం తెలిసిందే.

ఈనేపథ్యంలో అదే పథకం కింద అయోధ్యలోని శ్రీరాముడికి కూడా ఒక ఇంటిని కేటాయింని రాజ్ భర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో శ్రీరాముడికి కూడా ఇల్లు లేదనీ, ఆయనకు ఓ ఇంటిని కేటాయించాలని అధికారులను కోరారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి రామమందిరాన్ని నిర్మించాలని హిందూ సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంటే.. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చేవరకూ ఆగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles