తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం సోమవారం (డిసెంబర్ 31)తో ముగిసింది. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అమరావతికి 900 మంది ఉద్యోగులు బస్సుల్లో బయలుదేరారు. అంతకుముందు వీరికి తెలంగాణ న్యాయవాదులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. జస్టిస్ టీబీ రాధాకృష్ణన్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణ హైకోర్టుకు 13 మంది, ఏపీ హైకోర్టుకు 16 మంది న్యాయమూర్తులను కేటాయించారు.
హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాక 1956 నవంబర్ 5న హైదరాబాద్‌లో హైకోర్టును ఏర్పాటు చేశారు. నాటి నుంచి ఉమ్మడి ఏపీకి ఇది సేవలందించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా సేవలందించింది. ప్రతి రాష్ర్టానికి హైకోర్టు ఉండాలని చెబుతున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 214తో పాటు ఏపీ పునర్విభజన చట్టం - 2014 ప్రకారం, హైకోర్టును విభజిస్తూ ఇటీవల ప్రకటన వెలువరించారు.
ఏపీకి ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొనగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి హైకోర్టును తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా గుర్తించారు. జనవరి 1 నుంచి అందులోనే తెలంగాణ కార్యకలాపాలు కొనసాగుతాయని, అమరావతిలోని నేలపాడులో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు నూతన భవనాల్లో ఏపీ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో దశాబ్దాల ఉమ్మడి హైకోర్టు ప్రస్థానం ముగిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more