ఆంధ్ర న్యాయవాదులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రింకోర్టులో చుక్కెదురైంది. మరికోన్ని నెలల పాటు హైదరాబాదులోనే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును కొనసాగించాలని వారు దాఖలు చేసిన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మితమవుతున్న మరో హైకోర్టులో మౌలిక వసతుల కల్పన లేదని, అవి పూర్తయ్యే వరకు హైకోర్టును యధావిధిగా కొనసాగించాలని వారు పిటీషన్లో పేర్కోన్నారు.
అయితే రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేసి జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను కేటాయిస్తూ కూడా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అమరావతిలో నూతనంగా నిర్మితమవుతున్న హైకోర్టు ఇంకా పూర్తికాలేదని.. కాబట్టి కొన్ని నెలల పాటు హైదరాబాద్ హైకోర్టును ఉమ్మడి హైకోర్టుగానే కొనసాగించాలని అంధ్ర న్యాయవాదులు సంఘం పిటీషన్లో పేర్కోంది.
ఈ మేరకు ఇవాళ విచారణ సందర్భంగా ఆంధ్ర న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం వారి పిటీషన్ ను తోసిపుచ్చింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని ఆంధ్ర న్యాయవాదులను అదేశించిన న్యాయస్థానం.. నూతనంగా ప్రారంభం అవుతున్న క్రమంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడనున్న విషయం సహజమని చెప్పింది. ఈ మరకు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టీస్ నజీర్ తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నెలపాడులో ఏపీ హైకోర్టు ప్రారంభమైపోయిందని, న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తైయినందున ఈ పీటషన్ ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవాదులకు ఏమైనా సమస్యలు ఉంటే, ఏపీ ప్రభుత్వంతో చర్చించి, పరిష్కరించుకోవచ్చని, మరింత సమయం మాత్రం ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more