Rahul Dares PM Modi To One-On-One Debate రాఫెల్ డీల్ పై సమాధానాలు చెప్పేలేక పారిపోతున్న ప్రధాని..

Rahul gandhi s open book exam challenge to pm modi on rafale controversy

Rahul Gandhi,Rafale deal,arun jaitley,dassault aviation,Rafale Deal row,narendra modi,Nirmala Sitharaman,Congress President,Goa tape,manohar parrikar, manohar parrikar tape,Lok Sabha debate,Rafale jets issue

The Congress Party chief posed four questions to Modi on Twitter, on the number of planes, the costing, Parrikar's involvement and Anil Ambani's selection over HAL.

రాఫెల్ డీల్ పై సమాధానాలు చెప్పేలేక పారిపోతున్న ప్రధాని..

Posted: 01/03/2019 03:49 PM IST
Rahul gandhi s open book exam challenge to pm modi on rafale controversy

పార్లమెంట్ లో రఫేల్‌ ఒప్పందంపై చర్చ జరుగుతుంటే తాను సచ్చీలుడనని చెప్పుకునే ప్రధాని నరేంద్రమోడీ.. అవినీతిపై యుద్దం చేస్తానని పెద్ద అవినీతి కుంభకోణానికి తెరలేపారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘూటు విమర్శలు చేశారు. రపెల్ డీల్ విషయంలో పార్లమెంటులో చర్చ జరుగుతున్నా బదులు చెప్పాల్సిన బాధ్యత వున్న చౌకీధార్ ప్రధాని ఢిల్లీ నుంచి పారిపోయి.. పంజాబ్ లోని లవ్లీ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

రఫేల్‌పై జరుగుతున్న కీలక చర్చలో పాల్గొనకుండా ప్రధాని పంజాబ్‌ పారిపోయారని గురువారం రాహుల్‌ మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రఫేల్‌పై చర్చలో పాల్గొనకుండా ప్రధాని వర్సిటీ విద్యార్ధులకు లెక్చర్లు ఇస్తున్నారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. మోదీ గురువారం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో 106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రారంభించి అనంతరం గురుదాస్‌పూర్‌లో జరిగే ర్యాలీలో పాల్గొంటారు.

కాగా, ప్రధానికి తాను నిన్న సంధించిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని మోదీని కోరాలని విద్యార్ధులను రాహుల్‌ కోరడం గమనార్హం. రఫేల్ యుద్ద విమానాల కుంభకోణంలో జరిగిన అవినీతి అన్ని వర్గాల ప్రజల చోమటోడ్చిన సోమ్మని, అందువల్లే రఫేల్‌ ఒప్పందంపై తాను సంధించిన ప్రశ్నలు విద్యార్థులు ప్రధానికి సంధించాలని కోరారు. లోక్‌సభలో జరిగిన చర్చలో మోదీ సర్కార్‌పై రాహుల్‌ తీవ్రస్ధాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాహుల్‌ ఆరోపణలను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తోసిపుచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Rafale deal  arun jaitley  dassault aviation  PM Modi  manohar parrikar tape  Lok Sabha  

Other Articles