కేవలం రెండు నిమిషాల్లో తయారయ్యే వంటకంగా ఆబాలగోపాలం నోరూరించిన వంటకం ఏదీ అంటే మ్యాగీ గుర్తుకువస్తుంది. అలాంటి మ్యాగీ నూడుల్స్‌లో ప్రాణాంతక సీసం ఉందని ఇన్నాళ్లు ఈ విషయాన్ని అంగీకరించేందుకు తటపటాయించిన తయారీ సంస్థ నెస్లే.. తాజాగా అంగీకరించింది. తమ మ్యాగీ నూడుల్స్ లో ప్రాణాంతక సీసం ఉన్నమాట నిజమేనని దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నెస్లే ఇండియా అంగీకరించింది.
మ్యాగీ నూడుల్స్ లో అత్యంత ప్రమాదకరమైన సీసం అవశేషాలు ఉన్నట్టు మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్ఐ) గతంలోనే తేల్చింది. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నందుకు గాను నెస్లే ఇండియాకు రూ.640 కోట్ల జరిమానా విధించాలంటూ 2015లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)లో కేసు వేసింది.
అయితే, కేసు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు నూడుల్స్ ను పరీక్షించాలంటూ సీఎఫ్‌టీఆర్‌ఐని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో నూడుల్స్ ను పరీక్షించిన సీఎఫ్‌టీర్‌ఐ అందులో ప్రాణాంతక సీసం ఉన్నమాట నిజమేనని పేర్కొంది. తాజాగా, ఈ కేసు విచారణకు సంబంధించిన వాదనలు ప్రారంభం కాగా, సీసం ఉన్న నూడుల్స్ ను ఎందుకు తినాలంటూ నెస్లే తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కోర్టు ప్రశ్నించింది.
సింఘ్వి బదులిస్తూ.. ప్రభుత్వం చెబుతున్నట్టు నూడుల్స్ లో సీసం ఉన్నప్పటికీ అది అనుమతించిన మోతాదులోనే ఉందని పేర్కొన్నారు. అయితే, అది ప్రాణాంతక మోనోసోడియం గ్లుటమేట్ (ఎంఎస్‌జీ) కాదని కోర్టుకు తెలిపారు. దీంతో ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం వేసిన కేసును విచారించేందుకు జస్టిస్ డీవీ చంద్రచూడ్, హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం అనుమతించింది. కేసు విచారణ పూర్తైయ్యే వరకు మ్యాగీ నూడల్స్ ప్రియులు అగాల్సిందే. ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరీ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more