ఏ దేశంలోనైనా మహిళ అటవస్తువుగా మారాల్సిందేనా.. వారికి జరిగిన అత్చాచారాలపై ముందుకు వచ్చి నిందితులకు శిక్ష పడాల్సిందేనని ధైర్యంగా పిర్యాదులు చేస్తే.. వారిపై ప్రత్యర్థి న్యాయవాదులు వేసే దిగ్గుమాలిన, సిగ్గుమాలిన ప్రశ్నలను ఎదుర్కోవాల్సిందేనా.? సభ్యసమాజం అంగీకరించని తీరులో వ్యవహరించే న్యాయవాదులకు అవి కేసు విచారణలో ముఖ్యమే కావచ్చు.. కానీ బాధితురాలినే నిందితురాలిగా పరిగణించేలా ప్రశ్నలు ఉండటంతో వారేం సమాధానం చెబుతారు.
అన్నదమ్ములకు, జన్మనిచ్చిన తండ్రికి కూడా తమ బాధను చెప్పుకోలేని మహిళలు కేవలం అమ్మకు.. తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహితులకు మాత్రమే తమ బాధను చెప్పుకుంటారు. అలాంటిది అత్యాచారం కేసులలో న్యాయవాదలు అడిగే ప్రశ్నలు తమ వేదన, భాద, అక్రందనను అర్థం చేసుకోకుండా కేవలం తమ క్లయింట్లను రక్షించడమే పరమావధిగా పెట్టుకున్న ఢిఫెన్స్ లాయర్ల ప్రశ్నలకు సమాధానం చేప్పలేక ఓ యువతి న్యాయస్థానం పెక్కుటిల్లేలా విలపించింది.
బాధిత మహిళను ఢిపెన్స్ న్యాయవాది అత్యాచారం జరిపిన వ్యక్తి అంగం ఏ సైజులో వుంది..? అంటూ అంగానికి సంబంధించిన పలు ప్రశ్నలు సంధించేసరికి అమె న్యాయస్థానంలో ఏడ్చేసింది. తనపై అత్యాచారం జరిగిన ఘటనకన్నా ఢిపెన్స్ న్యాయవాది అడిగే ప్రశ్నలే శూలాల మాదిరిగా తన గుండెను గాయం చేస్తున్నాయని బాధిత మహిళ న్యాయస్థానంలో తన అక్రందనను వెళ్లగక్కింది. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ అలెక్స్ హెప్ బర్న్ తనను అత్యాచారం చేశాడన్న కేసులోని బాధిత అస్ట్రేలియన్ మహిళ ఈ ప్రశ్నలు ఎదురచయ్యాయి.
నిద్రపోతున్న తనపై అత్యాచారం చేశాడని అమె తెలిపింది. తన తోటి క్రికెటర్ జో క్లార్క్తో అప్పటికే అమె అంగీకార శృంగారంలో పాల్గోనింది. ఆ తరువాత తాను అయన క్లార్క్ పక్కనే నిద్రిస్తుండగా, అలెక్స్ హెప్ బార్న్ అత్యచారానికి పాల్పడ్డారని అమె పోలీసులకు పిర్యాదు చేయడంతో న్యాయస్థానంలో ఈ కేసు విచారణ సాగుతుంది.
వివరాల్లోకి వేళ్తే.. అలెక్స్ హెప్బర్న్ అనే 23 సంవత్సరాల ఆస్ట్రేలియన్ యువ క్రికేటర్, ఇంగ్లాండ్ లోని వార్చెస్టెర్ షేర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కు ఆడుతున్నాడు. అయితే ఓ రోజు తన సహచర ఆటగాడు జో క్లార్క్ ఓ అమ్మాయిని తన గదికి తీసుకొచ్చాడు. అదే గదిలో వుంటున్న హెప్ బర్న్, అమ్మాయి నిద్రించిన తర్వాత హెప్ బర్న్ అత్యాచారం చేశాడని బాధితురాలు కోర్టులో పెర్కోంది. అయితే ఇక్కడ విశేషమేమంటే.. వాట్సాప్ గ్రూప్ గేమ్ కారణంతోనే.. ఈ ఘటన జరిగిందని ఈ కేసును వాదిస్తున్న మిరండా మూరే తెలిపారు.
ఆ వాట్సాప్ గ్రూప్ గేమ్ రూల్స్ ప్రకారం.. ఆ గ్రూప్ లోని వ్యక్తులు ఎంతమంది అమ్మాయిలతో సెక్స్ లో పాల్గొన్నారో.. ఆ వివరాల్నీ గ్రూప్ లో పోస్ట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత.. ఎవరి సంఖ్య ఎక్కువగా ఉంటే.. వాళ్లే ఈ గేమ్ విజేతలు ప్రకటిస్తారు. ఈ గేమ్ లో గెలవడానికి హెప్ బర్న్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మూరే వెల్లడించారు. కానీ యువ క్రికెటర్ హెప్బర్న్ మాత్రం ఆ అమ్మాయి సంపూర్ణ అంగీకారంతోనే సెక్స్ లో పాల్గొన్నానని తెలిపారు. అంతేకాకుండా ఆ సమయంలో ఆ యువతి మేల్కొనే ఉందన్నారు.
కాగా తాను నిద్రిస్తున్న సమయంలో తనపై అత్యాచారం జరిగిందని మహిళ న్యాయస్థానంలో పేర్కోంది. కేసు విచారణలో భాగంగా అలెక్స్ తరపున డిఫెన్స్ న్యాయవాది బాధితురాలిని జోక్లార్క్ పురుషాగానికి సంబంధించిన.. నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న అలెక్స్ హెప్ బర్న్ పురుషాంగానికి మధ్య తేడా ఎలా తెలిసింది. అంటూ పురుషాగానికి సంబంధించిన పలు ప్రశ్నలు సంధించడంతో అమె న్యాయస్థానంలో గుండెలవిసేలా ఏడ్చేసింది. అయితే దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది.. త్వరలో ఈ కేసుపై తుది తీర్పు వెలువడనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more