మీ స్మార్ట్ ఫోన్లలో డేటా చౌర్యం జరుగుతుందన్న అనుమానాలు మీకు కలుగుతున్నాయా.? మీ ఫోన్లలో ఈ యాప్ లు వుండివుంటే మీ డేటాకు హాని కలిగినట్టే. ఈ మేరకు అరోపణలు రావడంతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి మొత్తం 85 యాప్స్ లను తొలగించినట్టు గూగుల్ పేర్కొంది. వీటిల్లో దాదాపు 50 లక్షలకు పైగా డౌన్ లోడ్లను పొందిన 'ఈజీ యూనివర్సల్ టీవీ రిమోట్' కూడా ఉండటం గమనార్హం.
గేమ్, టీవీ, రిమోట్ కంట్రోల్ సిమ్యులేటర్ కేటగిరీలో యాడ్ వేర్ కలిగుండే యాప్స్ వల్ల సెల్ ఫోన్లలోని డేటా తస్కరించబడుతోందని గూగుల్ పేర్కొంది. ఈ యాడ్ వేర్ ద్వారా ప్రకటనలు ఫుల్ స్క్రీన్ లో కనిపిస్తుంటాయని, యాప్‌లు మొబైల్ బ్యాక్ గ్రౌండ్ లో పని చేస్తుంటాయని తెలిపింది. కాగా ఈ విషయాన్ని ట్రెండ్ మైక్రో అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ మొదట రిపోర్టు చేసింది. 'ఫుల్ స్క్రీన్ యాడ్స్‌ను ప్రజెంట్ చేస్తూ, డివైస్ స్క్రీన్ అన్లాకింగ్ పనితీరును గమనించే ఇటువంటి యాప్‌లు చాలా ప్రమాదకరం.
యాప్ క్రాష్ అయ్యేంతవరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో మన ఫోన్ లాక్ ప్యాట్రన్‌తో పాటు ఇతర కీలక సమాచారం హ్యాకర్ల చేతికి సులభంగా చిక్కుతుంది' అని ట్రెండ్ మైక్రో పరిశోధకులు తమ బ్లాగులో కథనం వెలువరించారు. దాదాపు 90 లక్షల మందికి పైగా వీటిని డౌన్ లోడ్ చేసుకున్నారని, ఇవి మొబైల్ స్క్రీన్ అన్ లాకింగ్ యాక్షన్ ను తమ అధీనంలోకి తీసుకుని, ఫోన్ ను లాక్ చేసిన ప్రతిసారీ ప్రకటనలు చూపిస్తుంటాయని వెల్లడించింది.
మన ఫోన్లలో ఉండకూడని కొన్ని యాప్‌లు
* స్పోర్ట్ టీవీ
* ప్రాడో పార్కింగ్ సిములేటర్ 3డీ
* టీవీ వరల్డ్
* సిటీ ఎక్స్‌స్ట్రీమ్‌పోలీస్
* అమెరికన్ మజిల్ కార్
* ఐడిల్ డ్రిప్ట్
* టీవీ రిమోట్
* ఏసీ రిమోట్
* బస్ డ్రైవర్
* లవ్ స్టిక్కర్స్
* క్రిస్మస్ స్టిక్కర్స్
* పార్కింగ్ గేమ్
* బ్రెజిల్ టీవీ
* వరల్డ్ టీవీ
* ప్రాడో కార్
* చాలెంజ్ కార్ స్టంట్స్ గేమ్
* యూకే టీవీ
* ఫొటో ఎడిటర్ కొలాగ్ 1
* మూవీ స్టిక్కర్స్
* రేసింగ్ కార్ 3డీ
* పోలీస్ చేజ్
* ఫ్రాన్స్ టీవీ
* చిలీ టీవీ
* సౌతాఫ్రికా టీవీ సహా తదితర యాప్ లు వున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more