Rahul Gandhi to select Telangana CLP Leader రాహుల్ పైనే సీఎల్పీ ఎన్నిక బాద్యత

Rahul gandhi to select telangana clp leader

Legislature Party leader, Congress, CLP leader, chirumarthi lingaiah, komatireddy rajgopal reddy, CM KCR, newly elected MLAs, telangana Assembly, pro-tem speaker, mumtaz khan, Telangana martyrs, Telangana Politics

The newly elected Congress members of the Telangana Assembly have entrusted the task of electing the Legislature Party leader to the party High Command.

రాహుల్ పైనే సీఎల్పీ ఎన్నిక బాద్యత

Posted: 01/17/2019 12:55 PM IST
Rahul gandhi to select telangana clp leader

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎవరు కోనసాగనున్నారన్న అంశంలో అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని కాంగ్రెస్ నేతలు మరోమారు తన నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగించారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి తరపున సీఎల్పీ నేతగా ఎవరు వ్యవరిస్తారన్న అంశమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. క్రితం రోజు ఉదయం నుంచి అర్థరాత్రి వరకు సుదీర్ఘంగా సమావేశమైనా కాంగ్రెస్ నేతలు.. సీఎల్పీ విషయంలో మాత్రం కొలిక్కి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి సీఎల్పీ నేత ఎన్నిక తలనొప్పిగా మారింది.

దీంతో ఏఐసీసీ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్‌ గురువారం ఉదయం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సీఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అయితే సీఎల్పీ నేత ఎన్నికపై తుది నిర్ణయం రాహుల్ గాంధీకే అప్పగిస్తూ ఎమ్మెల్యేలంతా ఏకవాక్య తీర్మానం చేశారు. సీఎల్పీ పదవి కోసం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి సీఎల్పీ నేత రేసులో ఉన్నారు.

సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయం పార్టీ అధినేత రాహుల్ గాంధీ కోర్టులోకి చేరడంతో ఆయన ఎవరిని ఎంపిక చేస్తారోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు రాహుల్ తన నిర్ణయం ప్రకటిస్తారని సీఎల్పీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా, ప్రస్తుతం కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలందరిలో తానే సీనియర్ అని, సీనియారిటీ ప్రకారం సీఎల్సీ పదవి తనకే దక్కాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సీఎల్పీ నేత కోసం అదిష్టాన దూతల సమక్షంలో జరిగిన సీఎల్సీ సమావేశం తరువాత బయటికి వచ్చిన సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పనికిరానివాళ్లు చాలా మంది వున్నారని, ముందు పార్టీని ప్రక్షాళన చేయాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీకి కూడా ఇదే విషయాన్ని చెప్పాలని కోరారు. ప్రస్తుతం పార్టీలో ఉపాధ్యక్షులుగా కోనసాగుతున్నవాళ్లు, మరిన్నీ కీలక పదవుల్లో వున్న నేతలు వాళ్ల ఇంట్లోని ఓట్ల కూడా పడే పరిస్థతి లేదన్నారు.

ఇప్పటికైనా అధిష్టానం పార్టీ కోసం పనిచేసేవారికి పదవులను కట్టబెట్టాలని అయన కోరారు. మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ 10 ఎంపీ సీట్లు గెలవాలంటే పార్టీని ప్రక్షళన చేయాలని నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవాలంటే మార్పు రావాల్సిందేనన్నారు. పాత బ్యాచ్‌ అంతా పోవాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని ఆయన కోరారు.

ఇక.. ఎవరికి వారే సీఎల్పీ భేటీలో తమ డిమాండ్లను ఏఐసీసీ పెద్దల ముందు పెట్టడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు శాసనసభ స్పీకర్ పదవికి పోటీ చేయరాదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ అంశాన్ని ఎమ్మెల్యే సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించగా అందరూ అంగీకరించారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఏకగ్రీవానికి లైన్ క్లియర్ అయినట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles