Shivakumara Swamiji breathes his last at 111 నడయాడే దైవం సిద్ధ గంగ శివకుమార స్వామీజీ శివైక్యం

Walking god of karnataka siddaganga seer shivakumara swamiji passes away

Tumakuru district, Siddaganga Swamiji death, Siddaganga Mutt, Shivakumara Swamiji death, Shivakumara Swami, Ramanagara district, Karnatak University, kannada, Bharat Ratna

Supercentenarian Shivakumara Swamiji, popularly known as "Nadedaduva Devaru" (Walking God) in Karnataka, passed away in Tumakuru at 11.44 am on Monday following ill health. He was 111 years old.

నడయాడే దైవం సిద్ధ గంగ శివకుమార స్వామీజీ శివైక్యం

Posted: 01/21/2019 02:59 PM IST
Walking god of karnataka siddaganga seer shivakumara swamiji passes away

నడయాడే దేవుడిగా కన్నడవాసులు అరాధించే సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి శివైక్యం పొందారు. ఈ వార్త కన్నడీగులను విషాదంలో ముంచెత్తింది. వయోభారం, అనారోగ్యం కారణంగా స్వామీజీ సిద్దగంగ మఠంలోనే తన తుదిశ్వాసను విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన 111 ఏళ్లు వయస్సులో శివైక్యం పోందారు. బెంగళూరులోని సిద్ధగంగ హాస్పిటల్ లో ఆయన కొంతకాలం చికిత్స పొందారు.

ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఇవాళ ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, హోంమంత్రి ఎంబీ పాటిల్, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సహా ఇతర ముఖ్యనేతలు, వివిధ పార్టీల నాయకులు ఆయనను కలిశారు. కాగా, ఆయన శివైక్యం పోందిన వార్త తెలియగానే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పలువురు కేంద్రమంత్రులు, ఇతర జాతీయ నేతలు కూడా తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

స్వామీజీ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఆరోగ్య, విద్యా రంగాలకు స్వామి చేసిన సేవల్ని ఆయన ట్విట్టర్ ద్వారా గుర్తు చేసుకున్నారు. స్వామి శివైక్యంపై విచారం వ్యక్తం చేస్తూ... సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... గతంలో స్వామి నుంచీ ఆశీర్వాదం తీసుకున్న ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సంతాపం తెలిపారు. స్వామీజీ శివైక్యంతో ఏర్పడిన లోటు పూడ్చలేనిదన్నారు.

స్వామీజి మరణం నేపథ్యంలో మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించిన ప్రభుత్వం.. మంగళవారం అధికారిక సెలవుగా ప్రకటించింది. అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని ప్రకటించారు సీఎం కుమారస్వామి. అంత్యక్రియలకు భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన అధికారులు... ప్రముఖులు, సెలబ్రిటీల కోసం మఠానికి దగ్గర్లో హెలీప్యాడ్లు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. స్వామి భక్తులు, ప్రజలు కడసారిగా చూసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చెయ్యాలని మాట్లాడుకున్నారు.

నేషనల్ హైవే 48పై తుముకూరు వైపు వెళ్లే వాహనాల్ని ఇతర మార్గాల్లోకి మళ్లించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సిద్ధగంగ మఠంలో డాక్టర్ శివ కుమార స్వామీజీని... ప్రత్యక్ష దైవంగా భక్తులు భావిస్తారు. ఈ స్వామి రాష్ట్రంలో 100 విద్యా సంస్థల్ని నడుపుతున్న శ్రీ సిద్ధ గంగ ఎడ్యుకేషన్ సొసైటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2007లో కర్ణాటక ప్రభుత్వం ఆయనను రాష్ట్రంలో అత్యున్నత పురస్కారమైన కర్ణాటక రత్న పురస్కారంతో సత్కరించింది. 2015లో కేంద్రం నుంచీ ఆయన్ను పద్మ భూషణ్ అవార్డు వరించింది. స్వామికి భారత రత్న ఇవ్వాలని కుమారస్వామి కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles