Posing as SI, man tries to trick family, arrested పోలీసులకు చుక్కలు.. కటకటకాల వెనక్కి కేటుగాడు..

A 28 year old youth was nabbed on charges of extortion money posing himself as psi

Fake SI, Posing as SI, man tries to trick family, Narayana Gowda, Renuka Gowda, extortion of money, crime

Police arrested a 28 year old youth siddappa a native of shiggaon in Haveri, who was indulged in extortion of money, posing himself as a sub inspector of police, including newly joined SI in different parts of state.

పోలీసులకు చుక్కలు.. కటకటకాల వెనక్కి కేటుగాడు..

Posted: 01/24/2019 12:07 PM IST
A 28 year old youth was nabbed on charges of extortion money posing himself as psi

అడ్డదారిలో డబ్బు సంపాదన చేయాలని, ఈజీగా వచ్చే మనీకి అలవాడు పడిన ఓ కేటుగాడు ఏకంగా కొత్తగా విధుల్లోకి చేరిన ఎస్ఐలను కూడా టార్గెట్ చేసి మరీ వారి వద్ద నుంచి వేలకొద్ది డబ్బును వసూలు చేసి జల్సాలు చేశారు. మోసాలకు పాల్పడేవారు పాత్రలు, పాత్రధారులు ఇతరులు వుంటారు. కానీ ఇక్కడ మాత్రం అన్ని తానై పోషించుకుంటాడు. అందుకు సోషల్ మీడియాను కూడా వాడుకున్నాడు. ఫేస్ బుక్ లో అమ్మాయిగా... ఫోన్ లో వాయిస్ ఛేంజర్ తో ప్రేమికురాలిగా, బయట ఎస్‌ఐగా నటిస్తూ తన మోసాలకు తెరతీశాడు.

పోలీసుల కథనం మేరకు...నిందితుడు సిద్దప్పది కర్ణాటక రాష్ట్రం హుబ్లీ నగరం. ఇతను ఫేస్‌బుక్‌లో ‘భవిక’ పేరుతో ఓ అకౌంట్‌ క్రియేట్‌ చేశాడు. అమ్మాయినని చెప్పి యువకులతో చాటింగ్‌ చేసేవాడు. యువకుల మొబైల్‌ నంబర్లు తీసుకుని వాయిస్‌ చేంజర్‌ సాఫ్ట్‌వేర్‌తో అమ్మాయిలా మాట్లాడుతూ వ్యక్తిగత వివరాలు సేకరించి ప్రేమ పేరుతో వారిని ముగ్గులోకి దించేవాడు. ఇలా కొద్దిరోజులు గడిచిన తర్వాత పోలీసు అవతారం ఎత్తేవాడు. తాను ఎవరితోనైతే ఫోన్లో మాట్లాడేవాడో వారిళ్లకు వెళ్లేవాడు.
ప్రేమ పేరుతో మోసం చేశారని భవిక అనే అమ్మాయి ఫిర్యాదు చేసిందని, విచారణకు వచ్చినట్టు చెప్పేవాడు.

కేసు పేరుతో పలురకాలుగా బెదిరించి అవతలి వారు ఆందోళనకు గురవుతున్నారని గుర్తించిన వెంటనే బేరం పెట్టేవాడు. ఇంత మొత్తం ఇస్తే ఈకేసు నుంచి తప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పి డబ్బులు గుంజేవాడు. ఇలా మైసూరుతోపాటు బెంగళూరు తదితర ప్రాంతాల్లో యువకుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. అయితే మైసూరులోని శక్తినగర్‌కు చెందిన ఓ ఇంటి వద్ద ఇతని పాచిక బెడిసికొట్టింది. శక్తినగర్‌కు చెందిన శారదమ్మ అనే మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్న నిందితుడు మాటల్లో ఆమె కుమారుడు బెంగళూరులో ఉంటున్నట్లు తెలుసుకున్నాడు.

రెండు రోజుల క్రితం ఎస్‌ఐ వేషంలో శారదమ్మ ఇంటికి వచ్చిన సిద్దప్ప బెంగళూరులో మీ అబ్బాయి ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేసినట్టు మాకు ఫిర్యాదులు అందాయని, అందుకు సంబంధించి విచారణకు వచ్చినట్టు నమ్మబలికాడు. దీంతో శారదమ్మ, ఆమె భర్త నారాయణగౌడ్‌ కంగారుపడ్డారు. కొడుకు ఏదో తప్పుచేశాడని అనుకుని సిద్దప్పను ప్రాధేయపడ్డారు. ఇదే అదనుగా ఈ కేసు నుంచి తప్పించాలంటే తనకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంతమొత్తం లేదని, రూ.5 వేలున్నాయని శారదమ్మ చేతిలో పెట్టింది.

కానీ మొత్తం ఇవ్వాలని సిద్దప్ప డిమాండ్‌ చేయడంతో తెచ్చిస్తానంటూ శారదమ్మ భర్త నారాయణగౌడ బయటకు వెళ్లాడు. మొదటి నుంచి సిద్దప్ప ప్రవర్తన మీద అనుమానం ఉన్న అతను ఉదయ్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్‌ఐ జైకీర్తి హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రశ్నించగా తాను ఇంటెలిజెన్స్‌ ఎస్‌ఐని అంటూ తొలుత బుకాయించిన సిద్దప్ప.. తరువాత పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టే సరికి.. తాను నకిలీ పోలీసునని అంగీకరించాడు. దీంతో సిద్దప్ప వ్యవహారం బయటపడడంతో కటకటాల్లోకి నెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles