VVS Laxman mail Hacker convicted for three years లక్ష్మణ్ అకౌంట్ హ్యక్ చేసిన దోషికి మూడేళ్ల జైలు

Vvs laxman mail hacker and fraudster convicted for three years

VVS Laxman, cyber crime, cyberabad police, kukatpally court, rezwanul haq, Rs 10 Lakh, Kolkata, crime, Salt Lake police

A fraudster who had allegedly hacked into the account of cricketer VVS Laxman and removed Rs 10 lakh sentenced 3 years jail.

క్రికెటర్ లక్ష్మణ్ అకౌంట్ హ్యక్ చేసిన దోషికి మూడేళ్ల జైలు

Posted: 01/26/2019 05:07 PM IST
Vvs laxman mail hacker and fraudster convicted for three years

మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మెయిల్‌ హ్యాక్‌ చేసి ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.10లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరగాడికి మూడేళ్ల జైలుశిక్ష పడింది. కోల్‌కతాకు చెందిన రెజ్బానుల్‌ హక్‌ అనే వ్యక్తి లక్ష్మణ్ మెయిల్ హ్యాక్ చేసి డబ్బు కాజేసినట్లు నేరం నిర్ధారణ కావడంతో కూకట్‌పల్లి 9వ అదనపు ఎంఎం న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. దీంతోపాటు అతనికి రూ.40వేల జరిమానా కూడా కోర్టు విధించింది. మణికొండలో నివసించే లక్ష్మణ్‌కు ఎస్‌ఆర్‌నగర్‌ డీసీబీ బ్యాంకులో ఖాతా ఉండేది. 2014లో ఈ ఘటన జరగగా, అప్పటి నుంచి సైబర్‌క్రైమ్‌ అధికారులు ఈ కేసును విచారిస్తూనే ఉన్నారు.
   
తన ఖాతా నుంచి ఇతరుల ఖాతాకు డబ్బు పంపించే సమయంలో బ్యాంకు మేనేజర్ కు ఆ సమాచారాన్ని లక్ష్మణ్ మెయిల్ లో పంపేవారు. లక్ష్మణ్‌ అభ్యర్థన మేరకు బ్యాంకు సిబ్బంది నగదు బదిలీ చేసేవారు. దీనినే సైబర్‌ నేరగాడు అవకాశంగా మలుచుకున్నాడు. లక్ష్మణ్ మెయిల్ ను హ్యాక్‌ చేసి.. బ్యాంకుకు నకిలీ మెయిల్‌ పంపడంతో పాటు డబ్బును ఏ ఖాతాకు బదిలీ చేయాలో కూడా తెలిపాడు. దీంతో రూ.10లక్షల్ని బ్యాంకు సిబ్బంది బదిలీచేశారు. \

తన ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్లు సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో వెంటనే బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేసి ఆపై అప్పటి కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేయించగా.. నిందితుడు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ బ్యాంకులో గెలాక్సీ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిటగల ఖాతాలోకి డబ్బు బదిలీ అయినట్లుతేలింది. కోల్‌కతా బ్యాంకు సిబ్బందిద్వారా నిందితుడి జాడ తెలిసింది. దీంతో డబ్బుడ్రా చేసేందుకు బ్యాంకుకు వచ్చిన రెజ్బానుల్‌ హక్‌ను పట్టుకున్నారు. దీంతో లక్ష్మణ్‌ ఖాతా నుంచి నిందితుడు కొట్టేసిన మొత్తం డబ్బును పోలీసులు తిరిగి తెప్పించగలిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles