తెలంగాణలో నిరుద్యోగులకు శుభావర్త వచ్చింది. గురుకులాల్లో పోస్టుల భర్తీకి గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 119 మహత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల్లో 4322 పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. ఈ పోస్టుల్ని నాలుగేళ్లలో దశలవారీగా భర్తీ చేయనున్నారు అధికారులు.
వీటిలో రెసిడెన్షియల్ స్కూళ్లలో టీచర్లు, నాన్ టీచింగ్ కలిపి మొత్తం 3689 పోస్టులు మంజూరు చేస్తూ సోమవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఆదేశాలు జారీ చేశారు. గురుకుల సొసైటీలో పని చేసేందుకు మరో 28 రెగ్యులర్, 10 ఔట్ సోర్సింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. టీచింగ్, నాన్ టీచింగ్తోపాటు బీసీ గురుకులాల్లోని వివిధ కేటగిరీల్లో 595 ఔట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిని వచ్చే (2019-20) విద్యా సంవత్సరంలోనే భర్తీ చేయనున్నారు.
అలాగే 1,071 టీజీటీ రెగ్యులర్ సహా 1,904 పోస్టులను 2019-20 లో భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ అనుమతిచ్చింది. మిగతా రెగ్యులర్ పోస్టులను దశలవారీగా అధికారులు భర్తీ చేయనున్నారు. వీటికి టీఆర్ఈఐఆర్బీ (TREIRB) నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. 595 ఔట్ సోర్సింగ్ పోస్టులను బీసీ గురుకుల సొసైటీ భర్తీ చేయనుంది. వీటిలో ఐసీటీ ఇన్స్ట్రక్టర్లు -238 పోస్టులు, ల్యాబ్ అటెండర్లు- 238, ఆఫీస్ సబార్డినేట్-119. ఇక బీసీ రెసిడెన్షియల్ సొసైటీలో డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ పోస్టులు 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ 4, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 4 భర్తీ చేయనున్నారు.
మరోవైపు భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 1,948 ఖాళీలు భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీచేయనుంది. ఇందులో 137 గ్రూప్-1, 339 గ్రూప్-3 ఉద్యోగాలున్నాయని టీఎస్పీఎస్సీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం మీద తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అవుతుండటంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more