జాతిపిత మహాత్మాగాంధీకి ఘోర అవమానం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో మహాత్ముడ్ని చంపిన గాడ్సేకు పూజలు చేసి.. జాతిపితను దారుణంగా అవమానించారు హిందూ మహాసభ ప్రతినిధులు. అలీఘర్‌లో హిందూమహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్ పాండే.. దిష్టిబొమ్మకు గాంధీజీ ఫ్లెక్సీని తగిలించి.. తుపాకీతో కాలుస్తూ రాక్షసానందం పొందారు. తర్వాత గాడ్సే చిత్రపటానికి పూజలు చేసి నివాళులు అర్పించారు.
హిందూ మహాసభ గాంధీజి వర్థంతిని 'శౌర్య దివస్'గా జరుపుకుంటున్నారు. స్వీట్లు పంచుతూ గాడ్సే విగ్రహానికి పూల మాలలు వేస్తూ జాతిపితను దారుణంగా అవమానించారు. అంతేకాదు భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోవడానికి.. పాకిస్థాన్ దేశంగా ఆవిర్భవించడానికి గాంధీజీ కారణమని గుడ్డిగా వాదిస్తున్నారు. జాతిపితను తుపాకీతో కాలుస్తున్న ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది.
Hindu Mahasabha shot Mahatma Gandhi’s effigy; garlanded Nathuram Godse and distributed sweets to commemorate assassination. More details by @Amir_Haque pic.twitter.com/c5urEQVDbg
— TIMES NOW (@TimesNow) January 30, 2019
హిందూ మహాసభ తీరుపై నెటిజన్లతో పాటూ ప్రజలు మండిపడుతున్నారు. జాతిపితను దారుణంగా అవమానించిన హిందూ మహాసభ సభ్యలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని.. వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలంటున్నారు. హిందూ మహాసభ గతంలో కూడా మహాత్మాగాంధీపై వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది. ఏకంగా గాడ్సేకు విగ్రహం కూడా ఏర్పాటు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more