kanna attacks CM Babu on his photo in appadams ‘బాబు’ నీ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కెళ్లింది.?: కన్నా

Andhra bjp chief kanna attack cm babu on his photo in appadams

AP BJP chief, kanna laxminarayana, Kanna Laxmi narayana fires on AP CM, Chandra Babu, CM's photo on papad, CM's photo on appadams, Chandra Babu, dwacra group women, pasupu kumkuma programme, dwacra women, pasupu kumkuma, BJP, Andhra pradesh politics

AP BJP chief kanna laxminarayana attacks Andhra Pradesh Cheif Minister Chandra Babu on prinitng CM's photo on appadams distributed to dwacra group women during pasupu kumkuma programme

‘బాబు’ నీ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కెళ్లింది.?: కన్నా

Posted: 02/04/2019 12:23 PM IST
Andhra bjp chief kanna attack cm babu on his photo in appadams

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా ముంచుకోస్తున్న క్రమంలో ప్రభుత్వాలు తాము చేస్తున్న పనులు, ప్రవేశపెడుతున్న పథకాలపై పబ్లిసిటీ కల్పించేందుకు ప్రయత్నం చేస్తుండటం సాధారణ విషయమే.. ప్రతిపక్షాలు ప్రభుత్వాల తప్పిదాలను విమర్శచడం కూడా పరిపాటి. అయితే తాజాగా చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమ సభలో డ్వాక్రా మహిళలతో పాటు పెన్షన్ లబ్దిదారులకు పెట్టిన భోజనంతో పాటు అప్పడాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలు ముద్రించడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాబుగారు డబ్బలు లేవంటూ విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లడం.. ప్రత్యేక హాదా రాకపోవడంతోనే ఇబ్బందులు అంటూ ప్రచారం చేస్తున్న పసుపు-కుంకుమ కార్యక్రమాలతో జనంలోకి వచ్చిన ఆయన.. బోజనంతో పాటు అప్పడాలపై తన ఫోటోలను ముద్రించుకోవడంపై అటు ప్రతిపక్షాలు ఇటు నెట్ జనులు కూడా తమదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు. పేదప్రజలకు అందించిన తిండిపైనా నేతల ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి కోసం పాకులాడటం ఏంటని సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇది అభిమానులు చేసిన పని అని.. దానికి చంద్రబాబుపై విమర్శలకు సంబంధమేంటని తెలుగుతముళ్లు ప్రశ్నిస్తున్నారు.


తాజాగా ఇదే అంశంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై ట్విట్టర్లో చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కెళ్లిందని దుయ్యబట్టారు. ప్రజాసోమ్ముతో ప్రజలకు పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వం.. దానిని తమ సొంత జేబుల్లోంచి ఖర్చుపెడుతున్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. 'ఆశ-దోచే-అప్పడం బాబు..! కుర్చీ మీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికీ అప్పడాలపై, టిష్యూ పేపర్‌లపై, బాత్రూం కమోడ్లపై కూడా ప్రచారం చేసుకుంటున్నావ్! ఇదేం పిచ్చి బాబు!?' అని నిలదీశారు.


శారదా స్కాం మీరూ భాగస్వామేనా.?
పశ్చిమ బెంగాల్ లో జరిగిన శారదా స్కామ్ విషయంలో కేంద్రంపై విమర్శలు చేసిన చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ సందేహాలను వ్యక్తం చేశారు. శారదా స్కాం కుంభకోణంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలను చూసి.. గుమ్మడి కాయ దొంగల మాదిరిగా మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని చంద్రబాబుని నిలదీశారు. 'కొంపతీసి 'శారదా స్కామ్'లో కూడా 'తమరి హస్తం' ఉందా?!? అని ప్రశ్నించారు. 'పచ్చ కామెర్లు' వాడికి లోకం 'పచ్చగా' కనిపిస్తుందని సామెత మీకు వర్తిస్తుంది' అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో దీదీ గుండాగిరి, చంద్రబాబు దాదాగారి మరెంతో కాలం సాగదని అన్నారు.


అవినీతి ఎక్కడ ఏ రూపంలో వున్న కూకటి వేళ్లతో పెకిలించేందుకు తమ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని ప్రశ్నించడంపై కూడా ఆయన తీవ్రస్తాయిలో ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని కన్నా ప్రశ్నించారు. 'కాకినాడలో మహిళలను ఫినిష్ చేస్తా అన్నప్పుడు ఏమైంది మీ ప్రజాస్వామ్యం? అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేని దూషించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? సెక్రటేరియట్లో నాయీబ్రాహ్మణులను బెదిరించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం?'అని వరుస ట్వీట్లలో చంద్రబాబును కన్నా ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles