కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్ఆర్ఐ, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో తానే దారుణానికి పాల్పడ్డానని కేసులోని ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న రాకేశ్ రెడ్డి అంగీకరించాడు. అయితే తాను అప్పుగా ఇచ్చిన రూ. 4.5 కోట్లను సకాలంతో తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతోనే తాను ఆయన వద్దకు వెళ్లానని చెప్పారు. ఈ విషయంలో జయరాంకు తనకు మధ్య కాస్తా వాగ్వాదం పెరిగిందని చెప్పాడు.
అయితే కోపంలో తాను అతనిపై చేయి చేసుకున్నానని.. హార్ట్ పేషంట్ కావడంతో ఆయన మరణించాడని రాకేష్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. శవాన్ని ఏం చేయాలో తెలియక సాయంత్రం వరకు ఇంట్లోనే వుంచామని చెప్పారు. సాయంత్రం కారులో శవాన్ని ఎక్కించుకుని నందిగామకు చేరుకున్నామని, అక్కడ కారుతో పాటు ఆయన శవాన్ని కూడా వుంచి వచ్చేశామని చెప్పారు. కాగా, తాను జయరాంను కావాలని చంపాలేదని, కోపంతో రెండు దెబ్బలు కొట్టేసరికి ఆయన తట్టుకోలేక చనిపోయాడని రాకేశ్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.
కాగా, రాకేష్ రెడ్డి నేర చరిత్ర పై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో మోసాలు, దందాలు సెటిల్మెంట్లకు పాల్పడిన రాకేష్ రెడ్డి , అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయించడంలో దిట్ట. సినీనటిల చేత వ్యభిచారం చేయించినట్లు ఆరోపణలున్నాయి.ప్రముఖ హీరోయిన్ తో వ్యభిచారం చేస్తూ రాకేష్ రెడ్డి పట్టుపడ్డాడు.కొన్నాళ్ల క్రితం ఒక కేసులో రాకేష్ రెడ్డిని కూకట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసారు.కూకట్ పల్లి ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.80 లక్షలు రూపాయలను రాకేష్ రెడ్డి వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా, జయరాం హత్యకేసు విషయం తెలుసుకుని వచ్చిన ఆయన భార్య పద్మశ్రీ తన అత్తారింటిపై పలు అరోపణలు చేసింది. జయరాంకు ఆయన బంధువుల నుండే ప్రమాదం వచ్చిందని అరోపించారు. 2016లోనే తన భర్త తన సొంత అక్కయ్య వారి నుంచి ప్రమాదముందని చెప్పారని అమె అరోపించారు. అయితే ఇండియాకు వస్తే ఇంత ఘోరంగా చంపుతారని తాను ఊహించలేదని అమె అన్నారు. మీటింగ్స్ వుండటం వల్లే జయరాం ఇండియాకు వచ్చారని అమె చెప్పారు. శిఖ ప్రమేయం అధికం కావడం వల్లే అమెను ఛానెల్ నుంచి తొలగించామని పద్మశ్రీ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more