పాలుగారే నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసిన ఓ కసాయికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. చిన్నారిపై దారుణ అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను అటవీ ప్రాంతంలో వదిలేసిన పాఠశాల ఉపాధ్యాయునికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. అంతేకాదు ఉపాధ్యాయుడి వేషంలో వున్న మగమృగానికి శిక్షను అమలు పర్చడంలో తేదీని కూడా విధించింది అదేశాలను పంపింది. మార్చి 2న శిక్షను అమలు చేయాలని జబల్ పుర్ కేంద్ర కారాగార అధికారులను అదేశించింది.
గతేడాది జూన్ 30న నాలుగేళ్ల చిన్నారిని ఉపాధ్యాయుడు మహేంద్రసింగ్ గోండ్.. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమెపై అతిదారుణంగా అత్యాచారం చేశాడు. బాలిక స్పృహ కోల్పోయి అచేతనంగా మారడంతో, చనిపోయిందని భావించి ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. కుమార్తె ఎంతకూ ఇల్లు చేరలేదని తల్లిదండ్రులు వెతకగా ఎట్టకేలకు చిన్నారి జాడ కనిపించింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన తీవ్ర సంచలనం కావడంతో పోలీసులు వెంటనే నిందితుడిని పట్టుకున్నారు.
కాగా, పైశాచిక మగృం దాడిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన బాలికను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకుని హెలికాప్టర్ లో ఢిల్లీకి తరలించి ఎయిమ్స్ కు తరలించింది. దారుణ అకృత్యానికి ఆమె పేగులు బాగా దెబ్బతినడంతో నెలల తరబడి ఆ చిన్నారి నరకయాతన అనుభవించింది. పలు శస్త్రచికిత్సలు చేస్తేగాని సాధారణ స్థితికి రాలేకపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన నాగోద్ సెషన్స్ కోర్టు గత సెప్టెంబరులో నిందితుడికి మరణదండన విధించింది.
నాగోద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు వెళ్లగా రాష్ట్రోన్నత న్యాయస్థానం కూడా కింద కోర్టు తీర్పుపై సానుకూలంగా స్పందించింది. జనవరి 25న నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్న తీర్పును సమర్ధించింది. ఈ క్రమంలో శాంతా జిల్లా సెషన్స్ కోర్టు గోండ్ కు వ్యతిరేకంగా బ్లాక్ వారెంట్ జారీచేసింది. అతడిని వచ్చేనెల 2న ఉరి తీయాలంటూ జబల్పుర్ కేంద్ర కారాగారాన్ని ఆదేశిస్తూ ఈ-మెయిల్ పంపింది. సుప్రీంకోర్టు లేదా రాష్ట్రపతి నుంచి నిలుపుదల ఉత్తర్వులు రాకపోతే శిక్ష యథాతథంగా అమలవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more