సార్వత్రిక ఎన్నికల వేళ.. అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న సమాజ్ వాదీ పార్టీని అధికార బీజేపి పార్టీ అడ్డుకుంటోంది. ఎంతలా అంటే ఏకంగా ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను కూడా రాష్ట్రంలో తిరగనీయకుండా ఆంక్షలు విధిచేలా.? దీంతో అసలు తామున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా.. అంటూ సమాజ్ వాదీ నేతలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇక యోగి సర్కారు తమ అధినేతను అడ్డుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
ఎస్పీ కార్యకర్తల నిరసనలతో రాష్ట్రం దద్దరిల్లింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జీకి దిగారు. ఎస్పీ కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించారు. అలహాబాద్ యూనివర్సిటీలో విద్యార్థి నేత ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు బయలుదేరిన అఖిలేశ్ యాదవ్ లక్నో విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. అలహాబాద్ యూనివర్సిటీకి వెళ్లేందుకు వీల్లేదని ఆయన చెప్పారు. తాను చాలా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు.
విద్యార్థి నాయకుడి ప్రమాణస్వీకారోత్సవానికి వస్తున్న తమ నేతను పోలీసులు, ప్రభుత్వం అడ్డుకుందని తెలియడంతో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు లేకపోయినా.. అఖిలేష్ యాదవ్ ను అడ్డుకుని ప్రభుత్వమే కావాలని శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా విద్యార్థులను రెచ్చగోడుతుందని ఎస్పీ నేతలు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Samajwadi Party workers staged protests in many parts of Uttar Pradsh, including Prayagraj, Jaunpur, Jhansi, Balrampur and Gorakhpur, after party chief Akhilesh Yadav was stopped from travelling out of Lucknow to attend a university event
— NDTV (@ndtv) February 12, 2019
Read here: https://t.co/xAssMO7dBm pic.twitter.com/GC5gfqEpJU
అఖిలేశ్‌ను అడ్డుకోవడంపై అసెంబ్లీ, శాసన మండలి కూడా దద్దరిల్లాయి. ఎస్పీ సభ్యులు రాజ్‌భవన్‌కు చేరుకుని ధర్నాకు దిగారు. మరోవైపు యోగి ప్రభుత్వం తనను అడ్డుకోవడంపై అఖిలేశ్ స్పందించారు. విద్యార్థి నేత ప్రమాణ స్వీకారం కూడా యోగి సర్కారుకు నిద్రలేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. విమానాశ్రయంలోనే తనను అడ్డుకున్నారంటే అందులో కేంద్రం పాత్ర కూడా ఉండే ఉంటుందని ఆరోపించారు. అఖిలేశ్ ను అడ్డుకోవడంపై నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన ఎస్పీ కార్యకర్తలపై లాఠీ విరిగింది.
అయినా సమాజ్ వాదీ కార్యకర్తలు పట్టువదలకుండా రాజధాని రోడ్లపైకి వచ్చి.. యోగీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రికి రాష్ట్రంలో తిరిగే అధికారం లేకుండా చేసి.. బీజేపి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని వారో విమర్శించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా యోగా సర్కార్ కుతంత్రాలు పన్నుతుందని అరోపించారు. యోగీ సర్కార్ కు ఉత్తర్ ప్రదేశ్ ను పాలించే హక్కు లేదని నినదించారు.
రాష్ట్రంలో తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని నిరసనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అయితే నిరసనకారులపై ఎక్కడికక్కడ పోలీసులు లాఠీచార్జీకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. యూపీ ముఖ్యమంత్రి యోగీ ప్రాతినిధ్యం వహించే గోరఖ్ పూర్ లో ఉద్రిక్తలు మరింత ఎగసిపడ్డాయి. నిరసనకారులు వాహనాల అద్దాలను పగులగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more