stranger slits throat of biker, who gave him lift అర్థరాత్రి వేళ.. అపరిచితుడు లిప్ట్ అడిగాడని ఇస్తే..

Stranger slits throat of biker who gave him lift

Imran, cook, gajularamaram, stranger, lift, midnight, slit the throat, jeedimetla, two wheeler, sriram nagar, rivalry, cctv footage, cyberabad police

A stranger slits the throat of a two wheeler rider, after he has taken lift on the road. By hearing the screaming sound of Imran who works as cook for functions, locals ran up to the spot and rushed him to the hospital.

అర్థరాత్రి వేళ.. అపరిచితుడు లిప్ట్ అడిగాడని ఇస్తే..

Posted: 02/19/2019 10:07 AM IST
Stranger slits throat of biker who gave him lift

అర్థరాత్రి అంతా నిర్మానుష్యంగా వున్న సమయంలో ఓ ముక్కుమొహం తెలియని వారికి లిఫ్ట్ అడిగితే.. ఇకపై అలోచించాల్సిన అవసరం ఏర్పడింది. అర్థరాత్రనే కాదు.. నిర్జన ప్రాంతంలో ఎవరు లిప్ట్ అడిగినా.. ఇకపై ముందుగా కీడు ఎంచిన తరువాతే మేలు ఎంచాలని ఈ ఘటన మరోమారు చాటుతుంది. అర్ధరాత్రి వేళ రోడ్డుపై ఒంటరిగా నిల్చున్న ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగడంతో.. ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్లాలో పాపం అనుకుంటూ తనపై జాలి చూపించి లిప్ట్ ఇచ్చాడు ఓ వాహన దారుడు. అర్థరాత్రి వేళ బస్సులు కూడా తిరగవని దయతలచి లిప్ట్ ఇవ్వగా.. మార్గమధ్యంలో అతని గొంతు కోసి పరారయ్యాడు అగంతకుడు.

హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో జరిగిందీ దారుణం. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం పరిధిలోని చంద్రగిరి నగర్ కు చెందిన ఇమ్రాన్ (28) కుక్ (వంటమనిషి)గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి జీడిమెట్ల పరిధిలోని శ్రీరాంనగర్ లో ఓ ఫంక్షన్ హాల్ లో పని ముగించుకుని అర్ధరాత్రి దాటాక బైక్ పై ఇంటికి తిరుగు పయనం అయ్యాడు. మార్గమధ్యంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడగడంతో రాత్రివేళ కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.

కొంతదూరం వెళ్లాక బైక్‌పై వెనక కూర్చున్న వ్యక్తి వెంట తెచ్చుకున్న కత్తితో ఇమ్రాన్ గొంతు కోసి పరారయ్యాడు. రక్తంతో కుప్పకూలిన ఇమ్రాన్ కేకలు విన్న స్థానికులు, వాహనదారులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? లేక, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Imran  cook  gajularamaram  stranger  lift  jeedimetla  rivalry  cctv footage  cyberabad police  

Other Articles