ప్రభుత్వ ఉద్యోగం లేదా ఉద్యోగ భద్రత వున్న ఉద్యోగం కోసం ఎవరు మాత్రం ఎదురుచూడరు.? అలాంటి ఉద్యోగంతో ఇక కేంద్ర ప్రభుత్వం సంస్థ రైల్వేలో ఉందని తెలిస్తే ఎవరు మాత్రం దరఖాస్తు చేయకుండా వుంటారు. వందల పోస్టులకు లక్షల మంది పోటీ పడుతుంటారు. మాకు వస్తుందా అనుకుంటే పోరబాటే. ఎందుకంటే ఈ సారి పోస్టులు సంఖ్య వందలు వేలలో కాదు.. ఏకంగా లక్ష పైచిలుకు వుందంటే అదృష్టాన్ని పరీక్షించుకోక మానుకుంటారా.?
నిజమండీ రైల్వేలో ఏకంగా 1,30,000 పోస్టుల భర్తీ ప్రక్రియను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ (RRB) మొదలుపెట్టింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో ఆర్ఆర్బీ ఇచ్చిన ప్రకటన ప్రకారం మొత్తం 1,30,000 ఖాళీలను ఆర్ఆర్బీ భర్తీ చేయనుంది. అందులో 1,00,000 లెవెల్-1 పోస్టులు. మిగతా 30,000 వేర్వేరు కేటగిరీల పోస్టులు. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC), పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్ తో పాటు వేర్వేరు కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనుంది ఆర్ఆర్బీ.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం ఎప్పుడంటే..
RRB NTPC పోస్టులుకు- ఫిబ్రవరి 28
పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు- మార్చి 4
ఆర్ఆర్బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల ఖాళీలకు- మార్చి 8
ఆర్ఆర్బీ లెవెల్-1 పోస్టులకు- మార్చి12
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్ తో పాటు ఇతర పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
ఇక పారామెడికల్ స్టాఫ్‌లో స్టాఫ్ నర్స్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మాసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్ లాంటి పోస్టులు, ఆర్ఆర్బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల్లో స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్(హిందీ) పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. గతేడాది 62,000 గ్రూప్ సీ, డీ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన ఆర్ఆర్బీ ఈ ఏడాది ఏకంగా 1,30,000 రైల్వే ఉద్యోగాల భర్తీ చేస్తుండటం నిరుద్యోగులకు గొప్ప అవకాశం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more