దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ విఫ్.. చింతమనేని ప్రభాకర్.. ఏలూరులో తన అనుచరవర్గంతో ధర్నాకు దిగారు. తనపై ప్రతిపక్ష పార్టీ నేతలు నెట్టింట్లో దుష్ప్రచారం చేస్తున్నారన్ని అరోపిస్తూ.. ఈ ప్రచారంపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తన నియోజకవర్గం దెందులూరులోని ఏలూరు వద్ద ఆయన ధర్నాకు దిగారు. అయితే అప్పటికే ఆయన తమను అసభ్యపదజాలంతో దూషించారని.. తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళితులు, వారికి మద్దతుగా వైసీపీ నేతలు ధర్నాకు దిగిన ప్రాంతానికి చేరకుని చింతమనేని ధర్నాకు దిగారు.
ఇదిలా వుండగా ప్రస్తుతం రాష్ట్రంలోని వైసీపీ సర్కిళ్లలో చింతమనేనికి చెందిన ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఆయన దళితుల్ని అసభ్య పదజాలంతో దూషించారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు’అంటూ ఎమ్మెల్యే దూషించిన ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేశారు. గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. అదే సమయంలో జగన్ పశ్చిమ గోదావరి పాదయాత్ర ముగిడంతో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దళిత సంఘాలు, వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. చింతమనేనిపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏలూరు ఫైర్ స్టేసన్ సమీపంలో ధర్నాకు దిగారు. టీడీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని.. చంద్రబాబు చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. దళిత సంఘాలకు వైసీపీ నేతలు కూడా మద్దతు పలికారు. అయితే దళిత సంఘాలను తాను దూషించలేదని.. కావాలని ఎన్నికల సమయంలో తన ప్రతిష్టను దిగజార్చేందుకే వైసీపీ ఈ కుతంత్రాలకు తెరలేపుతుందని ఆయన అరోపించారు.
అంతటితో ఆగని ఆయన రోజురోజుకు తనపై విమర్శలు పేరుగుకుపోతున్న క్రమంలో ఇక చేసేది లేక.. స్వయంగా చింతమనేని కూడా ఏలూరులో అనుచరులతో కలిసి పోటీగా ధర్నాకు దిగారు. సోషల్మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇరు వర్గాలు పోటీగా ధర్నాలకు దిగడంతో.. భారీగా పోలీసుల్ని మోహరించారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని.. వీడియోను ఎడిట్ చేశారని చింతమనేని జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారట.
చింతమనేని అంతకముందు ఏలూరులోని సాక్షి కార్యాలయానికి కూడా వెళ్లారు. తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వీడియోలతో.. తన గురించి ఇష్టం వచ్చినట్లుగా వార్తలు ఎందుకు రాస్తున్నారంటూ నిలదీశారట. ఆయన అన్న మాట్లలు ఇలా వున్నాయి.. ‘‘రాజకీయాంగా మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కటే.. మీరు దళితులు.. మీరు వెనుకబడినటుంవటి వాళ్లు.. మీరు షెడ్యూల్డు కాస్టు వారు.. రాజకీయాలు మాకుంటాయ్.. మాకు పదవులు.. మీకెందుకురా పిచ్చి..కోడుకుల్లారా కొట్లాటా.. కడుపు తీపితో మీ పిల్లల్ని పెంచుకోడానికి.. ఏ రకంగా బాగుపడాలో అలోచించాల్సింది తప్పా.. అంటూ సాగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more