తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. రూ.లక్షా 82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.లక్షా 31,629 కోట్లు, ఆర్థికలోటు- రూ.27,749 కోట్లు, రెవెన్యూ మిగులు- రూ.6,564 కోట్లు, ప్రగతి పద్దు- రూ.లక్షా 7,302 కోట్లు, నిర్వహణ పద్దు- రూ.74,715 కోట్లు కేటాయించారు. ఇదిలావుండగా, డిసెంబర్ లో ఎన్నికల సందర్భంగా రైతులకు మారోమారు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని ప్రకటించిన సర్కార్ మాటను నిలబెట్టుకుంది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్.. ఈ సందర్భంగా రుణాలభారిన పడిన తెలంగాణ రైతులకు శుభవార్తను చెప్పారు. 2018 డిసెంబరు 11వ తేదీలోగా తీసుకున్న రైతు రుణాలు రూ.లక్ష వరకూ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ బడ్జెట్ లో వ్యవసాయాభివృద్ధి కోసం రూ.20,107కోట్లు కేటాయించారు. రైతు బంధు సాయం కింద ఎకరానికి రూ.10వేలు అందిస్తుండగా, ఇందుకోసం రూ.12వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా కోసం రూ.650కోట్లు కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం.. నీటిపారుదల శాఖకు రూ.22,500కోట్లు కేటాయించింది.
బడ్జెట్ కేటాయింపులు:
* బడ్జెట్ - రూ. 1,82,017 కోట్లు
* రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు
* మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు
* రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు
* ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు (అంచనా)
* 2018-19 ఆర్థిక వృద్ధి రేటు 10.6శాతం
* వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు
* రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు
* రైతు బంధుకు రూ.12 వేల కోట్లు
* రైతు బీమా రూ.650 కోట్లు
* మిషన్ కాకతీయకు రూ.22,500 కోట్లు
* పంటకాలనీల అభివృద్ధికి రూ.20,107 కోట్లు
* రైతు రుణమాఫీకి రూ. 6,000 కోట్లు
* నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు
* ఎస్సీల అభివృద్ధికి రూ.16,581 కోట్లు
* ఎస్టీల అభివృద్ధికి రూ.9,827 కోట్లు
* మైనార్టీల సంక్షేమానికి రూ.2004 కోట్లు
* ఈఎన్టీ, దంత పరీక్షలకు రూ.5,536 కోట్లు
* ఆసరా పెన్షన్లకు రూ.12,067 కోట్లు
* కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.1450 కోట్లు
* రూపాయికి కిలో బియ్యం పథకానికి రూ.2,744 కోట్లు
* దివ్యాంగుల పెన్షన్లకు రూ.12వేల కోట్లు
* ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు
* బీసీలకు మారో 119 రెసిడెన్షియల్ స్కూళ్లు
* వైద్య ఆరోగ్యశాఖకు రూ.5,536కోట్లు
* 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8 లక్షల నిధులు
* టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1,41 లక్షల కోట్లు పెట్టుబడులు
* టీఎస్ ఐపాస్ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు
* పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు భర్తీ
* ఏప్రిల్ చివరినాటికి మిషన్ భగీరధ పనులు పూర్తి
* మరో 2నెలల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు
* అన్ని సదుపాయాలతో రికార్డు స్థాయిలో 542 కొత్త గురుకులాలు ఏర్పాటు
* వచ్చే విద్యాసంవత్సరం నుంచి 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు
* ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం 51 డిగ్రీ గురుకులాలు
* విదేశీ విద్య కోసం అన్ని వర్గాల వారికి రూ.20 లక్షల స్కాలర్షిప్
* ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొనుగోలు కోసం ఏటా రూ.440 కోట్లు
* 40 ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు
* రైతుబంధు పథకం జాతీయ ఎజెండాగా మారింది
* రైతుబంధుని ఐరాస ప్రశంసించింది
* రెండు పంటలకు కలిపి 8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నాం
* భూరికార్డుల ప్రక్షాళన విషయంలో సాహసం చేశాం
* సాదాబైనామాల క్రమబద్దీకరణ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం
* ఇప్పటివరకు మత్స్యకారులకు 128 కోట్ల చేప పిల్లల పంపిణీ
* టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆత్మగౌరవంతో బతికేలా పెన్షన్లు
* చేనేత కార్మికులకు నెలకు రూ.15 వేలకు తగ్గకుండా వేతనం
* ఇప్పటి వరకు 2,72,763 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు
* కొత్తగా 3150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు
* అంతర్జాతీయ ప్రమాణాలతో 340 కి.మీ రీజినల్ రింగురోడ్డు
* రేషన్ బియ్యంపై కోటా పరిమితి ఎత్తివేశాం
* విద్యార్థులకు హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం
* నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల విషయంలో కఠిన చర్యలు
* 22.50 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాంలు నిర్మించాం
* ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేశాం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more