సీమాంతర వివాహాలు సర్వసాధరణంగా మారిన ఈ రోజుల్లో ఎవరు చూసినా.. ఈ వివాహాలను బాగా అదరిస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే సీమాంతర వివాహాలు.. ఇక్కడి వివాహబంధంలో వున్న పవిత్రత, బంధుమిత్రుల ఆశీర్వచనాలకు ఎందరో పరాయిదేశస్థులు ముగ్ధులై ఇక్కడి వరులను, వధువులను చేసుకునేందుకు తమ ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఈ కోవలో ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల వారు పాకిస్తాన్ లోని హిందూవులతో కూడా బంధం కలుపుకుంటున్నారు.
ఇక ఈ మధ్యకాలంలో దాయాధి దేశాల మధ్య ఎలాంటి వాతావరణం అలుముకున్నా.. తమకు నచ్చితే అక్కడి నుంచి సంబంధాలను తెచ్చుకోవడంలో మాత్రం వెనుకంజ వేయడం లేదు. దీంతో ఈ మధ్యకాలంలో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో సీమాంతర వివాహాలు సర్వసాధారణమయ్యాయి. రాజ్ పుత్, మెగవాల్, బీల్, సింధి, కాత్రి కమ్యూనిటీలు ఈ తరహా పెళ్లిలు చేసుకుంటాయి. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఓ జంట వివాహం ఆగిపోయింది.
రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాకు చెందిన మహేంద్ర సింగ్‌కు, పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లోని అమర్ కోట్ జిల్లాకు చెందిన చగన్ కర్వార్‌కు మార్చి 8న వివాహం జరగాల్సివుంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందడంతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాతే వివాహం జరిపిస్తామని తెలిపారు.
ఈ మేరకు వరుడు మహేంద్ర మీడియాతో మాట్లాడుతూ గత నెలలోనే తమ పెళ్లి నిశ్చయించారని, పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు. వివాహ ఆహ్వాన పత్రికలు కూడా పంచామని పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి వీసాలు కూడా తీసుకున్నామని... అక్కడికి వెళ్లేందుకు థార్ ఎక్స్‌ప్రెస్ టికెట్లు బుక్ చేశామని తెలిపారు. కానీ ఇప్పుడు తమ పెళ్లిని వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చామని.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాతే పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more