Nirmala Sitharaman touches feet of slain jawan’s mother అమరజవాన్ల తల్లులకు కేంద్రమంత్రి పాదాభివందనం..

Defence minister nirmala sitharaman touches feet of slain jawan s mother

Jammu kashmir, Pulwama, Encounter, Tral encounter, militant killed, CRPFJ&K police, Security Forces, terrorists, Pulwama Terrorist, Amara Jawan, Dehra Dun, Defense Minister, Nirmala Seetharaman, nirmala sitharaman dehradun event, indian army, politics

In a heartwarming gesture, Union Defence Minister Nirmala Sitharaman felicitates and touches feet of mothers of martyrs during Shaurya Samman Samaroh, as a mark of respect during an event in Dehradun.

ITEMVIDEOS: వైరల్: అమరజవాన్ల తల్లులకు కేంద్రమంత్రి పాదాభివందనం..

Posted: 03/05/2019 01:35 PM IST
Defence minister nirmala sitharaman touches feet of slain jawan s mother

పుల్వామా ఆత్మాహుతి దాడిలో సుమారుగా 44 మంది జవాన్లు అమరులు కాగా, వారి స్మృతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఱక్షణ మంత్రి నిర్మాల సీతారామన్ చేసిన సత్కారం ఆ తరువాత వారికి గౌరవంగా చేసిన చర్య ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.  అమరవీర జవాన్ల తల్లులకు నిర్మలా సీతారామన్ పాదాభివందనం చేయడం.. వారి హృదయాలతో పాటు నెట్ జనుల మనస్సులను కూడా కరిగించి.. ప్రశంసలు అందుకునేలా చేసింది.

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ఈ నెల 4న రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ పర్యటించారు. ఈ సందర్భంగా  డె్హ్రాడూర్ లో నిర్వహించిన ‘శౌర్య సమ్మాన్ సమరోహ్’ కార్యక్రమంలో అమర జవాన్ల తల్లులకు శాలువతో సత్కరించి.. మంత్రి ఘనంగా సన్మానించారు. అనంతరం వారి పాదాలకు నమస్కరించి వారిపై తనకున్న గౌరవాన్ని తెలియజేశారు. పాదాలకు నమస్కరించేందుకు మంత్రి కిందకు వంగుతుండడంతో అవాక్కైన కొందరు తల్లులు వారించినా నిర్మల పట్టించుకోలేదు.
 
అమరవీరుల తల్లులకు మంత్రి ఇస్తున్న గౌరవాన్ని చూసిన అధికారులు..కార్యక్రమానికి హాజరైన వారు చప్పట్లో మంత్రిని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పలువురి ప్రశంసలు పొందుతోంది. కాగా పుల్వామాలో పాక్ ఉగ్రవాదులు చేసిన మానవబాంబు దాడిలో భారత్ కు చెందిన 40మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి అనంతరం పాక్ పై భారత్ సర్జికల్ దాడులు..అనంతరం పాక్ - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pulwama Terrorist  Amara Jawan  Dehra Dun  Defense Minister  Nirmala Seetharaman  politics  

Other Articles