తెలంగాణకు చెందిన దంత వైద్యురాలు ప్రీతి రెడ్డి హత్యకేసు ఆస్ట్రేలియా పోలీసులకు సవాల్ గా మారింది. ఆమె మాజీ ప్రియుడే అమెను అత్యంత దారుణంగా హత్యచేశాడా.? అన్న అనుమానాలు విపిస్తున్నక్రమంలో ఆయన కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం పోలీసులకు సవాల్ గా మారింది. ప్రీతీ హత్యకేసును ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తూన్న తరుణంలో అనుమానిత మాజీ ప్రియుడు దుర్మరణం చెందడం పోలీసులకు కొత్త సవాళ్లను విసురుతుంది.
ప్రితీరెడ్డి మరణానికి ముందు ఏం జరిగి ఉంటుందన్న దానిపై వారికి అంతుచిక్కడం లేదు. అదృశ్యమైన ప్రీతిరెడ్డి మృతదేహం మంగళవారం రాత్రి ఓ సూట్‌కేసులో శవమై కనిపించింది. ఆమె వేరొకరితో సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిన మాజీ ప్రియుడు హర్ష్ నర్డే ప్రీతితో మాట్లాడేందుకు శనివారం టామ్‌వర్త్ నుంచి సిడ్నీ వచ్చాడు. తాను మారానని, ఇక నీవు కూడా అదే పని చేయాలని అమె తన నర్డేకు సూచించిందని ఈ మేరకు అస్ట్రేలియాకు చెందిన దినపత్రిక టెలిగ్రాప్ పేర్కోంది.
అంతేకాకుండా తాను వేరోకవ్యక్తిని కలిశానని, అతనితో సీరియస్ గా వున్నానని.. ఈ క్రమంలో తాము మెల్ బోర్న్ ప్రాంతానికి కూడా వెళ్తున్నామని చెప్పిందని విశ్వసనీయవర్గాలు అక్కడి దినపత్రికలకు సమాచారాన్ని అందించాయి. కాగా అదే రోజునే ఆయన సిడ్నీకి చేరుకున్నాడని కూడా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ కలిసి ఓ వైద్య సదస్సుకు హాజరయ్యారు. ఆ తర్వాత ఓ హోటల్ వద్ద ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుండగా తాను చూశానని వారి స్నేహితుడొకడు పోలీసులకు తెలిపాడు.
మరోపక్క, ప్రీతిరెడ్డి మృతదేహాన్ని కనుగొన్న ప్రాంతానికి 340 కిలోమీటర్ల దూరంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్డే కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ప్రీతిరెడ్డి సిడ్నీలోని మెక్‌డొనాల్డ్స్ వద్ద ఒంటరిగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలు కనిపించాయి. తనకు పరిచయస్తుడితో అదే హోటల్లో ఆమె బస చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ప్రీతి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ఆ తర్వాత కాసేపటికే నర్డే ఓ భారీ సూట్‌కేసును పోర్టర్ సాయంతో కారులోకి ఎక్కిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే అదే సూట్ కేసులో ప్రీతి మృతదేహం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, అదే రోజు రాత్రి ప్రీతి స్నేహితుల్లో ఒకరికి నర్డే మెసేజ్‌లు పెట్టిన విషయాన్ని గుర్తించారు. శనివారం సాయంత్రం ప్రీతితో మాట్లాడానని, ఇంటికి వెళ్తున్నానని చెప్పిందని ఎస్సెమ్మెస్ చేశాడు.
అయితే, ఆమె కనిపించడం లేదని అవతలి వ్యక్తి చెప్పడంతో బహుశా ఎక్కడైనా నిద్రపోతుండవచ్చని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత యాక్సిడెంట్లో నర్డే మృతి చెందాడు. అయితే, అది యాక్సిడెంట్ కాదని, ఆత్మహత్యేనని పోలీసులు ఆ తర్వాత నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో మరెవరినీ అనుమానితులుగా భావించడం లేదన్న పోలీసులు నర్డేకు గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more