Pawan Kalyan, Nara Lokesh eyes vishakapatnam విశాఖపై ఫవన్, లోకేష్ నజర్.. అక్కడి నుంచే బరిలోకి..!

Pawan kalyan nara lokesh eyes vishakapatnam for contesting assembly polls

pawan, lokesh eyes vishaka, pawan to contest from vishaka, lokesh to contest from vizag, janasena, JSP, Pawan Kalyan, pitapuram, gajuwaka, TDP, Nara Lokesh, Vishakapatnam East, Andhra pradesh, politics

Even after two days of release of Election Shedule for Andhra Pradesh Assembly, sources sasy Janasena party president pawan kalyan and TDP working president Nara Lokesh had not yet decided their constituencies from where to contest elections.

ఉత్తరాంధ్రపై ఫవన్, లోకేష్ నజర్.. అక్కడి నుంచే బరిలోకి..!

Posted: 03/12/2019 01:25 PM IST
Pawan kalyan nara lokesh eyes vishakapatnam for contesting assembly polls

సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసి అప్పుడే రెండు రోజులు కావస్తున్న క్రమంలో రాష్ట్రంలోని మూడు పార్టీలకు చెందిన ముగ్గురు యువనేతల్లో వైసీపీ అధినేత తన సొంత పులివెందుల నియోజకవర్గం నుంచే బరిలోకి దిగనున్నారు. కాగా, ప్రత్యక్ష ఎన్నికలలో తొలిసారిగా బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గం విషయమై ఇంకా స్పష్టతకు రాలేదని తెలుస్తోంది.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తాము వామపక్షాలతో కలసి పోటీ చేస్తామని చెప్పిన పవన్ అటు సీపీఎం, సీపీఐ నేతలతో ఓ వైపు చర్చలు నిర్వహిస్తూనే.. వారికి వదిలిన స్థానాలను మినహాయించి మిగతా స్థానాల అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే పనిలో వున్నారు జనసేనాని పవన్. కానీ, తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా తేల్చుకోలేదని తెలుస్తుంది. కాగా, ఉత్తరాంధ్ర అంటే తనకు ఎనలేని ప్రేమ అని.. ప్రకటించిన ఆయన ఉత్తరాంధ్రనే టార్గెట్ చేసుకుని అక్కడి నుంచి తాను పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, తూర్పుగోదావరి లేదా విశాఖపట్నం జిల్లా నుంచి జనసేన అధినేత పోటీ చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల నుంచి చెబుతున్నాయి. పవన్ తూర్పగోదావరిలోని పిఠాపురం అసెంబ్లీ లేదా గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక టీడీపీకి చెందిన యువనేత మంత్రి నారా లోకేష్ కూడా తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

దీంతో ఆయన ఏక్కడి నుంచి పోటీ చేస్తారన్న వార్తలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు పెండింగ్ లో ఉన్న అభ్యర్థుల ఖరారుపై దృష్టిపెట్టగా.. మరోవైపు నారా లోకేస్ ను ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారన్న విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతుంది?, కాగా, లోకేష్ కూడా ఉత్తరాంధ్ర నుంచే బరిలో దిగుతారని టీడీపీ వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి. నారా లోకేష్ విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుస్తారని ముందుగా వార్తలు వచ్చినా.. ఆ స్థానాన్ని సీబిఐ జేడీ లక్ష్మీనారాయణ కోసం వదిలినట్టు తెలుస్తుంది. దీంతో లోకేష్ విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దిగే అవకాశాలు వున్నాయని పార్టీ వర్గాలు పేర్కోంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janasena  JSP  Pawan Kalyan  pitapuram  gajuwaka  TDP  Nara Lokesh  Vishakapatnam East  Andhra pradesh  politics  

Other Articles