లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమ పార్టీలో ధీటైన అభ్యర్థులు లేకపోవడంతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్న పార్టీలు కాంగ్రెస్, టీడీపీ నేతలకు గాలం వేస్తూ వారిని తమ పార్టీలో చేరేలా అకర్షిస్తున్నాయి. అంతేకాదు పార్టీల ఫిరాయింపులు తెరలేపుతున్నాయి. తమ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలచేలా చేస్తున్నాయి. గెలుపోటములను పక్కనబెడితే.. తమ పార్టీలో బంగారు భవిష్యత్తు కల్పిస్తామని హామీలు గుప్పిస్తున్నాయి.
తమ పార్టీ జెండాలను ఏళ్లుగా, దశాబ్దాలుగా పట్టుకుని తిరిగిన నేతలకు చరిష్మా లేకపోవడంతో.. ఇతర పార్టీల అభ్యర్థులను తమ పార్టీలో చేర్పించి.. తద్వారా పార్టీని బలోపేతం చేయాలని పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆకర్షణలకు ఆపర్లకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి క్యూకట్టారు. ఈ క్రమంలో మరో కాంగ్రెస్ సీనియర్ నేత హస్తం పార్టీకి బిగ్ షాకిచ్చాచారు.
గులాబి బాస్ పై ఒంటికాలుపై లేచిన డీకే అరుణ.. ఆ మధ్య టీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు వార్తలు వచ్చినా.. తాజాగా అమె అనూహ్యంగా బీజేపి తీర్థం పుచ్చుకోబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకీ ఇప్పటికే రాజీనామా చేసిన ఆమె ఏకంగా హస్తిన బాట పట్టి బీజేపి అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ఇప్పుడీ వార్త కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఇవాళ ఉదయం డీకే అరుణ నివాసానికి చేరకున్న బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇరువురు నేతల మధ్య సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బీజేపీ చీఫ్ అమిత్ షాతో డీకే అరుణను ఫోన్లో మాట్లాడించినట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్‌పై అరుణకు బీజేపీ అధ్యక్షుడు భరోసా కల్పించినట్లు సమాచారం. దాంతో ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిజేపి పార్టీ తరపున మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలో దిగనున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more