Chandrababu Is Forced to Change Puthalapattu Candidate పూతలపట్టులో హైడ్రామా.. అభ్యర్థుల మార్పు..

Chandrababu is forced to change puthalapattu candidate

Puthalapattu, Terlam Purnam, Lalitha Thomas, chandrababu, TDP, YS Jagan, YSRCP, Puthalapattu MLA, Sunil, YCP Puthalapattu candidate MS Babu, andhra pradesh, politics

TDP has changed its Puthalapattu MLA candidate Terlam Purnam, with Lalitha Kumari Thomas, who will now be announced as the fresh candidate for Puthalapattu Assembly constituency in Chittoor district.

పూతలపట్టులో హైడ్రామా.. అభ్యర్థుల మార్పు..

Posted: 03/21/2019 06:53 PM IST
Chandrababu is forced to change puthalapattu candidate

చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పలువురి దృష్టిని అకర్షిస్తోంది. ఇక్కడి అభ్యర్థుల ఎంపిక, ఆశావహులు బెదరింపులు, అభ్యర్థుల అదృశ్యం కావడంతో ఈ నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్తితులు నెలకొన్నాయి. నామినేషన్ల పర్వానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం వున్న నేపథ్యంలో పార్టీలు యుద్దప్రాతిపదికన అభ్యర్థులను ప్రకటించి.. ఆ తరువాత మార్పులు చేర్పులను చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే తనకు వైసీపీ టికెట్ ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ ఏకంగా హైదరాబాద్ లోని వైఎస్సార్ సిపి ప్రధాన కార్యాలయం లోటస్ పాండ్ కు చేరకుని అధినేత కలిసేందుకు మూడు రోజుల పాటు పడిగాపులు కాసినా.. ఆయన ప్రయత్నాలన్ని విఫలయత్నం అయ్యాయి. దీంతో ఆయన ఏకంగా అత్మహత్య చేసుకుంటానని ఓ సెల్పీ వీడియోను కూడా పంపి వైసీపీ శ్రేణులను, తన అనుచరగణాన్ని గందరగోళంలోకి నెట్టారు. కాగా ఈ వీడియో రాజకీయ వర్గాలో పెద్ద సంచలనంగా మారింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకు టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన తన సెల్ఫీ వీడియోలో వివరించారు. ఆ తర్వాత సునీల్ ఆత్మహత్యాయత్నం చేయడం కూడా సంచలనంగా మారింది. అయితే వైసీపీ తరఫున ఎంఎస్ బాబు అభ్యర్థిత్వాన్ని వైసీపీ ఖరారు చేసింది. దీంతో తనకు టికెట్ రానందుకు తీవ్ర మనస్థాపానికి గురైన ఎమ్మెల్యే సునీల్‌.. తాను ఎంత విన్నవించినా అధిష్టానం పట్టించుకోలేదని, మరొకరికి అవకాశం ఇచ్చిందన్న అవేదనతో ఆత్మహత్యాయత్నం చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇక టీడీపీలో కూడా అభ్యర్థి అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సారి పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా తెర్లాం పూర్ణంకు టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఎందరో ఆశావహులు పోటీ పడుతున్నా.. అధిష్టానం అన్ని సమీకరణలు చేసిన తరువాత తెర్లాం పూర్ణంకు టికెట్ కేటాయించింది. అయితే ఈ టికెట్ తనకు వద్దంటూ చెప్పిన ఆయన ఆ తరువాత కనిపించకుండా పోయారు. దీంతో పూర్ణం వైసీపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. అసలేం జరుగుతుందో కూడా పార్టీ అధిష్టానానికి అంతుచిక్కలేదు.

పూతలపట్టు అభ్యర్థి విషయంలో హైడ్రామా కొనసాగిన నేపథ్యంలో వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్న టీడీపీ అధిష్టానం వెంటనే అభ్యర్థిని మార్చేసింది. పూర్ణం స్థానంలో లలితకుమారి అలియాస్ లలితా థామస్‌ను అభ్యర్థిగా ఖరారు చేసినట్టు సమాచారం. గత కొన్నిరోజులుగా లలిత కుమారికే టికెట్ దక్కుతుందంటూ ప్రచారం జరిగింది. ఆమె కూడా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కానీ, చివరి నిమిషంలో పూర్ణం టికెట్ దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్లీ లలితకుమారికి అవకాశం ఇచ్చారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తెర్లాం పూర్ణం ఇవాళ ఉదయం అకస్మాత్తుగా టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. అనారోగ్యంతో వున్న తాను చికిత్స చేయించుకోవడానికి వెళితే తనపై తప్పుడు ప్రచారం చేశారని పూర్ణం ఆరోపించారు. కేవలం తప్పుడు ప్రచారంతో తనకు దక్కిన టిక్కెట్ చేజార్చుకున్నానని ఆనయ బాధపడుతున్నారు. అయితే పార్టీ నిర్ణయం మేరకు తాను నడుచుకుంటానని.. టీడీపీ గెలుపుకు సహకరిస్తానని ఆయన అన్నారు. దీంతో పూతలపట్టులో వైసీపీ తరఫున ఎంఎస్ బాబును లలితా ధామస్ ఎన్నికలలో ఎదుర్కోననున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puthalapattu  Terlam Purnam  Lalitha Thomas  chandrababu  TDP  YS Jagan  YSRCP  andhra pradesh  politics  

Other Articles