Video Shows Balakrishna abusing Journalist వీడియో జర్నలిస్టుపై నోరు జారిన బాలయ్య..

Mla nandamuri balakrishna rude behavior with video journalist

TDP, Nandamuri Balakrishna, Balayya act yet again in Hindupur, Balakrishna threatens video journalist, Hindupur, Election campaign, video journalist, Andhra Pradesh, Politics

Nandamuri Balakrishna does a Balayya act yet again. He is caught bad mouthing a TV Reporter for allegedly shooting something of him. He terrified the Reporter to delete the footage he shot and warned the Reporter of dire consequences.

ITEMVIDEOS: అనవాయితీ కొనసాగించిన బాలయ్య.. వీడియో జర్నలిస్టుపై బూతులు

Posted: 03/27/2019 10:38 PM IST
Mla nandamuri balakrishna rude behavior with video journalist

సినీ హీరో, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో తన అనవాయితీ కొనసాగించారు. అయితే ఇప్పటి వరకు తన అభిమానులు, పార్టీ కార్యకర్తల వరకు పరిమితమైన ఆయన అనవాయితీ ఇక మీడియా వరకు చేరింది. ఇంతకీ ఏంటా అనవాయితీ అంటారా.? చేయి చేసుకునే అనవాయితీ. నంద్యాల ఉప ఎన్నికల నుంచి ప్రారంభమైన బాలయ్య ఈ అనవాయితి ప్రతి ఎన్నికలనూ కొనసాగిస్తూ వస్తున్నారు.

ఇలా చేయడంలో వల్లే నంద్యాల ఉపఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి గెలిచారనో లేక మరెమోగానీ దీనిని ఆయన సెంటిమెంటుగా కూడా మార్చుకున్నారా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే తెలంగాణలోని ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే అనవాయితీని ప్రదర్శించిన ఆయనకు ఖమ్మం జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వచ్చినా.. ఆ జిల్లాలో ఆయన ప్రచారం చేసిన ఇద్దరు టీడీపీ అభ్యర్థులు సండ్రా వెంకట వీరయ్య, నాగేశ్వరరావులు విజయం సాధించారు.

బహుషా అందుచేతనే ఆయన దీనిని తన సెంటిమెంటుగా కూడా మర్చుకున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు వ్యంగస్త్రాలు సంధిస్తున్నారు. ఇక తాజాగా హిందూపురం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వీడియో జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు. ప్రాణాలు తీస్తా జాగ్రత అంటూ హెచ్చరించారు. హిందూపురంలో బాలయ్య ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఘటన జరిగింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలకృష్ణ హిందూపురంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తల ఇంట్లో బోజనం చేసి వస్తుండగా, కొందరు పిల్లలు కాన్వాయ్ కు అడ్డుగా రావడంతో.. బాలయ్య సెక్యురిటీ సిబ్బంది వారిని పక్కకు లాక్కెళ్లారు.

ఈ వీడియోను ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి వీడియో తీశాడు. వెంటనే గమనించిన బాలయ్య అతడిపైకి దూసుకెళ్లారు. కెమెరాలో రికార్డ్ చేసిన వీడియోను వెంటనే తొలగించాలని బెదిరింపులకు దిగారు. నరికి పోగులు పెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం కూడా తెలుసు.. కత్తి తిప్పడం కూడా తెలుసు అంటూ హెచ్చరించారు. బాలయ్య మీడియా ప్రతినిధిపై చేయి చేసుకోవడాన్ని చుట్టుపక్కల ఉన్నవాళ్లు మొబైల్ లో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్నది స్పష్టం రావాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Nandamuri Balakrishna  Hindupur  Election campaign  video journalist  Andhra Pradesh  Politics  

Other Articles