కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఇప్పటికే బీజేపి వైసీపీ మధ్య చీకటి ఒప్పందం వుందన్న వార్తలు వినిపిస్తున్న క్రమంలో ఎన్నికల తరువాత వైసీపీ తప్పకుండా బీజేపి గూటికి చేరవల్సిందేనని అన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై విశ్వేషించిన ఆయన వైసీపీ పార్టీయే కాకుండా ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కూడా తమ గూటికే చేరుతుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతన్న ఫెడరల్ ఫ్రంట్ లోని పార్టీలన్నీ కూడా తప్పక బీజేపి గూటికే చేరుతాయని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రండ్ స్వప్నం అవిష్కృతం కాదని, ఆ తరుణంలో ఆ ఫ్రంట్ లోని చాలావరకు పార్టీలు ఎన్డీయేలో చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అంతటితో ఆగని మాజీ మంత్రి.. సమయం అనుకూలిస్తే మళ్లీ టీడీపీ కూడా ఎన్డీయే పక్షాన చేరే అవకాశం ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ పక్షాలకు ఎన్నికలు పూర్తయ్యాక ఎన్డీయేనే దిక్కు అని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోదీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ దత్తన్న డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో 11 సార్లు సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయంటున్న కేసీఆర్, ఒక్కసారైనా క్యాబినెట్ మీటింగ్ కు హాజరయ్యారా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో ఒక్కరోజు కూడా మంత్రిగా సమాధానం చెప్పని వ్యక్తి, 11 సార్లు సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయంటే నమ్మేదెవరు? అని అన్నారు. ఆయనకు సర్జికల్ దాడుల గురించి ఏం తెలుసని నిలదీశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more