ఆంద్ర్రప్రదేశ్ రాష్ట్ర అధికార పగ్గాల కోసం రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలతో పాటు మార్పు కోసం వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీలు పోటీపడుతూ.. తమ ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇక వారి అభిమానులు కూడా అంతకురెట్టింపు స్థాయిలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమలో కొందరు అభిమానులు నేతల కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ రహస్యంగా రాజశ్యామాల యాగం చేశారన్న వార్త తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే ఆయన ఈ యాగాన్ని అత్యంత గోప్యంగా చేశారని బెంగళూర్ మిర్రర్ అనే పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త వెలుగులోకి రాగానే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ తన సోదరి, బావల చేత శ్రీయాగం నిర్వహింపజేశారు. ఈ యాగం ఇవాళ పూర్తికావస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో మరో చిన్నారి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ.. ఏకంగా లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చింది.
అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే అధిష్టించాలని ఈ చిన్నారి ఆకాంక్షించింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని ఆకాంక్షిస్తూ కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి అనే పదో తరగతికి చెందిన చిన్నారి తిరుమల వెంకటేశ్వరస్వామికి రూ.లక్ష విరాళంగా సమర్పించింది. దీనికి సంబంధించిన డిపాజిట్ ప్రతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో బి.లక్ష్మీకాంతంకు పంపించింది. అంతేకాదు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే శ్రీవారిని దర్శించుకుంటాననీ..తిరుమలకు నడిచి వస్తానని మొక్కుకుంది వైష్ణవి.
అయితే ముఖ్యమంత్రి చంద్రాబాబు అంటే ఈ చిన్నారికి ఎంత అభిమానమో చెప్పనక్కల్లేదు. ఎందుకంటే.. చంద్రబాబు చేపట్టిన కీలక ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాలని, నిరాటంకంగా అభివృద్ది పనులు పూర్తికావాలని అమె ఇప్పటికే అకాంక్షించింది. అంతటితో ఆగకుండా పోలవరం ప్రాజెక్టు కోసం తన తండ్రి డాక్టర్ మనోజ్ సహకారంతో ఎకరం భూమి రాసిస్తానని కూడ వైష్ణవి చెప్పింది. ఇక ఆంధ్రరాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం అమె తన తల్లిదండ్రులతో కలసి వెళ్లి చంద్రబాబుకు ఏకంగా లక్ష రూపాయాల విరాళాన్ని అందజేసింది. దీంతో వైష్ణవిలా అందరూ ప్రేరణపొందాలని అమెను అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు చంద్రబాబు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more