జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ విజయనగరం జిల్లాలో తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో పవన్ అక్కడ ప్రచారం చేయడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది. విజయనగరం పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న పవన్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు వైద్యులు సూచించారు.
గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో గుంటూరు జిల్లా తెనాలి, సత్తెనపల్లిలో రోడ్‌షో, బహిరంగ సభలు రద్దుచేసినట్టు పార్టీ నేతలు వెల్లడించారు. శనివారం నుంచి ఆయన ప్రచారానికి సిద్ధమవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఒక్కోసారి అభిమానుల అత్యుత్సాహం కూడా నాయకులను ఇబ్బందులకు గురిచేస్తుంది.
తాజాగా, పవన్ కల్యాణ్ కు అలాంటి పరిస్థితే ఎదురైంది. విజయనగరంలో నిర్విరామ ప్రచారంతో ఒకవైపు అరోగ్యం సహకరించకున్నా.. ఆయన అక్కడి సభకు హాజరై ప్రసంగించారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని దూకుడు ప్రదర్శించి ఓ నా దేవుడా అంటూ పవన్ కల్యాణ్ కాళ్లపై పడ్డాడు. అది చూసిన సెక్యూరిటీ అతడ్ని వెనక్కు లాగేందుకు యత్నించగా అభిమాని పవన్ కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పిన పవన్ కిందపడ్డారు. వెంటనే తేరుకుని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
JanaSena Chief @PawanKalyan dehydrated due to lack of proper rest from past few days. pic.twitter.com/X1ajSVu2g9
— JanaSena Party (@JanaSenaParty) April 5, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more