ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తాము ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో కుమ్మక్కై.. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నామన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలు సత్యదూరమైనవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ వేలు పెడుతుందని చెప్పడం సహేతుకం కాదని, బీబేపి కూడా ఓ రాజకీయ పార్టీ అని.. తాము కూడా ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తామని, అంతమాత్రాన తమను కార్నర్ చేసి చంద్రబాబు విమర్శలు చేయడమేంటని ఆయన మండిపడ్డారు.
జగన్ ను తామేమీ తమ ప్రాక్సీగా (ప్రతినిధిగా) వినియోగించుకోవడం లేదని, ఆయన ఓ టీవీ చానల్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒకవేళ తాము నిజంగానే జగన్ కు అండగా వుండివుంటే.. ఆయన కేసుల విచారణ, ఆయన సంస్థల అస్తుల సీజ్, ఆయన బంధువుల ఆస్తుల అటాచ్ మెంట్ జరిగి ఉండేదా? అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు విమర్శిస్తున్నట్లుగా తమకెవరూ బీ-టీమ్ లేరని స్పష్టం చేశారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకునే నష్టపోయామని రాంమాదవ్ అన్నారు.
చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు తాము బలైపోయామని, ఇకపై అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా సొంతంగా ఎదిగేందుకు కృషి చేస్తామని అన్నారు. 2024లో తాము సోంతంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు. జగన్ పై కేసులున్నాయని, అందుకనే ఆయన బీజేపీని ఏమీ అనడం లేదని విమర్శిస్తున్న చంద్రబాబు.. తనపై బీజేపి ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ రోడ్డు మీద ధర్నాలకు దిగుతున్నాడని.. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారని రాం మాదవ్ ఎద్దేవా చేశారు.
ఇన్వెస్టిగేటింగ్ ఏజన్సీల స్వతంత్రతను తాము ఎన్నడూ అడ్డుకోవడం లేదని, వారు చేసే పని వారు చేసుకుంటూ పోతున్నారని, తాము కల్పించుకోవడం లేదని వెల్లడించారు. సీబీఐ, ఈడీలను బీజేపీ వాడుకుంటోందన్నది తప్పుడు ఆరోపణలని, అలాగే వాడుకుని వుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది జైల్లో ఉండేవారని అన్నారు. గతంలో తప్పులు చేసి ఉండబట్టే చంద్రబాబు ఇప్పుడు భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు. తప్పు చేయకుంటే విచారణంటే భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more