liquor shops remain closed till 11th evening ముగిసిన ప్రచారపర్వం.. ప్రలోభపర్వాలపై ఈసీ నిఘా

Liquor shops remain closed till 11th evening in telugu states

sale of liquor, wine shops closed, telugu states liquor sales, liquor sales in telanagana, liquor sales in andhra pradesh, liquor sales elections, liquor distribution, excise department, andhra pradesh, Telangana

sale of liquor remains closed in telugu states and the places where 1st phase of lok sabha elections are taking place from today 5pm upto 11th evening 5pm ie for two days.

ముగిసిన ప్రచారపర్వం.. ప్రలోభపర్వాలపై ఈసీ నిఘా

Posted: 04/09/2019 07:01 PM IST
Liquor shops remain closed till 11th evening in telugu states

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తొలి విడత ఎన్నికలు జరుగనున్న 91 పార్లమెంటు స్థానాలలో ఇవాళ్టితో మైకులు మూగబోయాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో తొలివిడతలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు అంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటుగా లోక్ సభకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ సాయంత్రంలో ప్రచారపర్వం ముగిసిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మైకులు మూగబోయాయి. ప్రచార పర్వం ముగిసిపోవడంతో ఇక ప్రలోభపర్వానికి తెరలేవనుంది.

ఓటర్లను మద్యం సీసాల పంఫిణీతో పాటు డబ్బు కూడా పంచేందుకు పార్టీల నేతలు అనేక ప్రయత్నాలకు తెరలేపనున్నారన్న వార్తల నేపథ్యంలో అలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎన్నికల అధికారులు అన్నిచోట్ల నిఘా పెట్టారు. ఇక మద్యం పంఫిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా  ఉండేందుకు.. ఎన్నికల సంఘం అదికారులు అదేశాలతో మద్యం అమ్మకాలకు కూడా ప్రచారపర్వం ముగింపుతోనే బ్రేక్ పడింది. ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి తెలంగాణలో, సాయంత్రం 6 గంటల నుంచి ఏపీలో మద్యం షాపులు మూసివేశారు.

ఎన్నికల సంఘం  ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ దుకాణాలపై నిఘా పెట్టింది. ఓటర్లను ప్రలోభపెట్టకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. రెండు రోజులు షాపులు మూసివేస్తారనే ముందస్తు సమాచారంతో.. పార్టీలు, నేతలు అలర్ట్ అయ్యారు. ముందుగానే స్టాక్ పెట్టుకున్నారు. మరికొందరు అయితే టోకెన్ల రూపంలో స్టాక్ పెట్టుకున్నారు. వైన్ షాపులతోపాటు బార్లు, త్రీస్టార్ హోటళ్లలోనూ లిక్కర్ సేల్స్, సరఫరా నిలిపివేశారు. రూల్స్ బ్రేక్ చేసి మద్యం అమ్మకాలు చేస్తే లైసెన్స్‌ రద్దు చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరికలు జరాచేశారు. కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్, పోలీసు అధికారులు హెచ్చరించారు. బెల్టుషాపుల్లో విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles