case filed against TRS MP candidate మంత్రి తలసాని, ఆయన కుమారుడు సాయిలపై కేసు నమోదు

Case filed against talasani srinivas yadav and his son sai kiran yadav

case filed against talasani srinivas yadav, case filed against telangana minister, case filed against TRS MP candidate, case filed against secundrabad TRS MP candidate, TRS candidate talasani sai kiran yadav, talasani srinivas yadav, talasani sai kiran yadav, secundrabad lok sabha, TRS MP candidate, election flying squad, Telangana, politics

Election Flying Squad officials filed case against Telangana minister Talasani Srinivas Yadav and his son, TRS secundrabad MP candidate sai kiran yadav for offering prayers in church and asking their votes in church.

మంత్రి తలసాని, ఆయన కుమారుడు సాయిలపై కేసు నమోదు

Posted: 04/10/2019 12:59 PM IST
Case filed against talasani srinivas yadav and his son sai kiran yadav

తెలంగాణ సీనియర్ రాజకీయ నేత మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తన పుత్రవాత్సల్యంతో ఎన్నికల నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. రాష్ట్ర మంత్రిగా పలు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. తన కుమారుడి గెలుపు కోసం చేసిన చిన్న తప్పుడు పనితో ఆయనతో పాటు ఆయన కుమారుడు  టీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థి సాయికిరణ్ పై కేసు నమోదయింది. లోక్ సభ తొలివిడత ఎన్నికల ప్రచారపర్వానికి క్రితం రోజు సాయంత్రం తెరపడింది.

అయితే అంతకుముందు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుమతి లేకుండా వీరిద్దరూ పాఠశాలలో సభను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ లోని రెజిమెంటల్‌ బజార్ పరిధిలో తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన తలసాని, సాయికిరణ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక వైపు పాఠశాలలో సభను నిర్వహించడంతో పాటు మత ప్రాతిపదికన ఓట్లర్లను ఓట్లు కూడా అడగటంతో వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయి.

ఈ సభలో తమకు ఓటేయాల్సిందిగా సభికులను వీరిద్దరూ కోరినట్లు తెలుస్తోంది. ప్రార్థనల కోసం అనుమతి తీసుకుని ఎన్నికల ప్రచారానికి వినియోగించడంపై ఫ్లయింగ్ స్వ్కాడ్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు తలసాని శ్రీనివాస్ యాదవ్, సాయికిరణ్ యాదవ్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, కార్పోరేటర్ ఆకుల రూప, క్రిస్టియన్ కౌన్సిల్ బిషప్ గొల్లపల్లి జాన్‌పై  పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles