సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిసిన తరుణంలో ఫలితాలు వెలువడటానికి, ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా వుందని తేలేందుకు మరో మండలం రోజుల పాటు నిరీక్షించాల్సిన వస్తుది. అయితే ఓటింగ్ జరిగిన తీరు, ప్రజల నాడి బట్టి ఎవరికి వారు విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత డిసెంబర్ 11న సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కచ్చితంగా ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తామని అన్నారు.
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియంది కాదు. అయితే ఎన్నికలు ముగిసన క్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి సైతం వస్తామని కేసీఆర్ చెప్పడం.. అదే క్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా విజయవాడకు వచ్చి యాదవ సంఘాల సభ్యులతో మాట్టాడటం అంతా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రచారానికి రాని కేసీఆర్.. జగన్ తో చేయి కలిపి తెరవెనుక నుంచి డ్రామాలు అడించారన్న వార్తలు కూడా ఇప్పుడు ప్రచారలో నిలిచాయి.
ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిస్తూ.. రిటర్న్ గిప్ట్ ఎలా వుండబోతుందో మే 23న తెలుస్తోందని చెప్పారు. దీంతో అంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసన తరుణంలో వైసీపీ అధినేత జగన్ ను పత్రికా సమావేశంలో ఈ విషయమై ఓ విలేకరి ప్రశ్నించారు. ‘రిటర్న్ గిఫ్ట్ రెడీగా ఉందా?’ అని జగన్ ని ప్రశ్నించగా, ‘రిటర్న్ గిఫ్ట్ ఏంటమ్మ? నాకు అర్థం కాలేదు’ అని అన్నారు. ఈలోగా, తోటి విలేకరులు కల్పించుకుని ‘బాబుకు కేసీఆర్ ఇస్తానన్నారుగా’ అని అనడంతో, జగన్ స్పందిస్తూ, ‘బాబుకు, కేసీఆర్ కు మధ్య ఉంటే, వాళ్లను అడగాలి గానీ, నన్ను అడుగుతారేంటి?’ అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more