ఎన్నికల వేళ తమిళనాడులో ఐటీదాడుల కలకలం రేపుతున్నాయి. ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేసి దాడులు నిర్వహిస్తున్నారన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో తమ మిత్రపక్షానికి చెందిన అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన పలు సంస్థలపై అదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నెల 18న ఎన్నికలకు వెళ్లునున్న తరుణంలో తమిళానాడులోని ప్రముఖ నిర్మాణరంగ సంస్థలు, రెండు ఫైనాన్షియర్ల సంస్థలు అధికార పార్టీకి ఎన్నికల నిమిత్తం లెక్కల్లో లేని డబ్బును పంపుతున్నారన్న పక్కా సమాచారంతో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ కాంట్రాక్టులను దక్కించుకునే పీఎస్కే ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన పలు నివాసాలు, ఆఫీస్‌లలో శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. చెన్నై, నమక్కల్, తిరునల్వేలిలోని 18 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో రూ.14.72 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ఓటర్లకు నగదు పంచేందుకు అభ్యర్థులకు పీఎస్కే నుంచి పెద్ద మొత్తంలో నగదు పంపుతున్నట్లు ఐటీ శాఖకు సమాచారమందింది.
దీంతో శుక్రవారం తెల్లవారుజామున పీఎస్కే యజమానులు, వారి సంబంధీలకు ఇళ్లు, ఆఫీస్‌లలో అధికారులు సోదాలు చేశారు. ఐటీ అధికారుల బృందం చెన్నై ఎగ్మూరు, అన్నానగర్, సెంట్రల్ ప్రాంతాల్లోని పీఎస్కే చైర్మన్ పెరియస్వామి, కొడుకులు అరుణ్, అశోక్‌ల ఇళ్లు, వీరి ఫైనాన్షియర్లు ఆకాశ్ భాస్కర్, సుజయ్ రెడ్డిల ఇళ్లు, ఆఫీస్‌లు కలుపుకుని మొత్తంగా 10 చోట్ల సోదాలు నిర్వహించారు. సుజాయ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీస్‌లలో లెక్కల్లో చూపని రూ.18 లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు. తిరునల్వేలి, విల్లుపురం, నమక్కల్‌లలోనూ తనిఖీలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more