Miraculous escape for three on a bike యూపీ పోలీసులపై నెట్ జనుల ప్రశంసలు..

Up police chase bike caught on fire save family of three

up police, fire, viral video, twitter reactions, netigens, Life savers, Agra-Lucknow expressway, uttar pradesh, Indian news

A video of police in Uttar Pradesh saving the lives of a family riding on a bike that caught fire has been posted on Twitter. The frightening video shows the family was unaware about the fire and police helped them in the nick of time.

ITEMVIDEOS: ముగ్గురు ప్రాణాలను కాపాడిన యూపీ పోలీసులు.. నెట్ జనుల ప్రశంసలు..

Posted: 04/16/2019 08:03 PM IST
Up police chase bike caught on fire save family of three

పోలీసు వృత్తి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని.. అంతే ధర్మతతో వాటిని నిర్వర్తించే పోలీసులు కూడా ఉన్నారని ఈ ఘటన మరోమారు నిరూపించింది. అచ్చంగా సినీఫక్కిలో జరిగిన ఈ ఘటనను చూస్తే దంపతులు వారి బిడ్డతో పాటుగా బైక్ పై వెళ్తుంటే.. పోలీసులు ఎందుకని వారిని చేజ్ చేస్తున్నారు అన్న అనుమానాలు అందరిలోనూ కలిగాయి. కానీ పోలీసులు వారిని నిలువరించి.. వెంటనే చేపట్టిన చర్యలతో ఆ ముగ్గురు ఇవాళ ప్రాణాలతో వున్నారు.

ఆగ్రాకు చెందిన ఓ దంపతులు వారి కుమారుడుతో కలిసి ద్విచక్రవాహనంలో వెళ్తున్నారు. తమ పెట్రోలింగ్ వాహనాన్ని ఓవర్ టేక్ చేసి మరీ దూసుకెళ్తున్నారు. బైక్‌కు ఎడమవైపు వున్న లేడిస్ హ్యాండిల్ కు తగిలించిన బ్యాగ్ సైలెన్సర్ కు ఆనుకొని మంటలు చెలరేగాయి. ఎండ వేడిమితో పాటు సైలెన్సర్ కూడా వేడిక్కడంతో ఆ ప్లాస్టిక్ బ్యాగ్ వేడికి, గాలి కూడా తోడై మంటలు అంటుకున్నాయి. ఆ విషయం గమనించని వారు అలాగే దూసుకెళ్తున్నారు.

బైక్‌ వెనక భాగం నుంచి చిన్నగా మంటలు చెలరేగుతున్న విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే వారిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. అయితే వారు ఎంతకీ వినిపించుకోకుండా వెళ్తుండటంతో పోలీసులు కూడా తమ వాహనం వేగం పెంచారు. ఈలోపు బైక్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ బైక్ లో వెళ్తున్న వారితో పాటులో పోలీసులు కూడా దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి చివరికి విషయం చెప్పారు. వెంటనే బైక్ ను పక్కన నిలిపేయించిన పోలీసులు.. వారిని దూరం జరగాల్సిందిగా సూచించారు.

సైలెన్సర్‌ వద్ద ఉన్న బ్యాగ్‌ను జాగ్రత్తగా పక్కకు తొలగించారు. అనంతరం మంటలను పూర్తిగా ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసుల సమయస్ఫూర్తి కారణంగా ముగ్గురి ప్రాణాలు నిలబెట్టాయి.. ఈ ఘటనతో యూపీ పోలీసులు వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఈ వీడియో యూపీ పోలీసులు ట్విటర్‌లో పంచుకున్నారు. దీంతో ఇది వైరల్‌ అవుతోంది. ట్విటర్‌ వేదికగా ఆ పోలీసులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles