అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఒక్క రోజునే మూడు కాలాలను రాష్ట్రవాసులకు చూపిస్తూ.. అందోళన కలిగిస్తున్నాయి. ఈదురుగాలులు, వడగండ్ల వానలతో హైదరాబాద్ నగరంతో పాటు పలు గ్రామీణ ప్రాంతాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వీరికి తోడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రంగం కూడా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రమాదంలో కూరుకుపోయిన వారిని పట్టించుకునే వారు ఉంటారా.? తమ ప్రాణాలనోడ్డి ఇతరుల ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేస్తారా.?. అంటే అలాంటి వారు ఉన్నారు.
హైదరాబాద్ కోఠి నుంచి అప్జల్ గంజ్ వెళ్లే మార్గంలో సరిగ్గా గౌలీగూడ వద్ద ఓ నాలుగేళ్ల చిన్నారి దివ్య నాలాలో పడిపోయింది. సమాచారం తెలిసిన ఫైర్ మెన్ క్రాంతి కుమార్ నాలాలోకి వెళ్లి ఆ చిన్నారి దివ్యను మృత్యువు నుండి కాపాడారు. ఈ విషయాన్ని వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి పాపను కాపాడిన ఫైర్మేన్ క్రాంతి కుమార్ ను అభినందించారు. అంతేకాదు క్రాంతి కుమార్కు కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా అందించారు. ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా ఈ బహుమతిని అందజేశారు.
క్రాంతి కుమార్ కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ ఫైర్ సేషన్ ఆఫీసర్ జయరాజ్ కుమార్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ప్రమాదానికి గురైన నాలుగేళ్ల బాలికను కూడా ఆదుకుంటామని అల్లు అరవింద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున ఆర్. స్వామినాయుడు పాల్గొన్నారు. అంతేగా మరి మంచి చేసిన వారికి తగిన గుర్తింపును అందిస్తే.. వారు మరింత మంచి చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే భావన పెంపోందించడానికి మెగాస్టార్ చిరంజీవి చేసిన అభినందన కార్యక్రమంలో క్రాంతికుమార్ ను రియల్ హీరోగా నిలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more