Pawan Kalyan reacts over Inter students suicide అధికారులూ.. ఎదరుదాడి కాదు.. పరిష్కారం చూపండీ: పవన్ కల్యాణ్

Pawan kalyan reacts over inter students suicide in telangana

pawan kalyan on Intermiediate students suicide, pawan kalyan on inter students parents agitation, pawan kalyan on intermiediate board officials, pawan kalyan CM KCR, pawan kalyan Inter marks goof -up, pawan kalyan Intermiediate results, pawan kalyan on Globarina, pawan kalyan interboard failure, Pawan Kalyan, Janasena, Intermiediate students, students suicides, CM KCR, Inter marks goof -up, Intermiediate results, Globarina, Telangana, politics

Janasena party chief Pawan Kalyan has responded for the first time regarding the over Inter students suicide and Board officials negligence. Where PK has suggested the Inter Board officials instead of attacking parents and students, atleast now come out with plans to how to justify students.

విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వానిదే బాధ్యత: జనసేనాని పవన్

Posted: 04/24/2019 03:23 PM IST
Pawan kalyan reacts over inter students suicide in telangana

తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలకు పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ఇంటర్ బోర్డు అగమ్యగోచరంగా మార్చడం దారుణమని చెప్పారు. 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. మార్కుల విషయంలో అందోళన చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి వస్తే.. అధికారులు వారిని చులకన చేసి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అధికారులు ఎదురుదాడి చేసేలా మాట్లాడుతుండటాన్ని ఖండిస్తున్నామని పవన్ చెప్పారు. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాల వెల్లడి వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయని... వాటిని నివృత్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డులో అసలేం జరిగిందో నిజానిజాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ చేయాలని అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన తల్లిండ్రులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల మరణాలను మాస్ హిస్టీరియా అని ఒక అధికారి పేర్కోనడం.. మరో అధికారి ఎంసెట్, జాతీయ పరీక్షలే కాకుండా ఐటీఐ, హోటల్ మేనేజ్ మెంట్ వంటి అనేక కోర్సులున్నాయని వాటిని కూడా చేసుకోవచ్చునని ఉచిత సలహాలను ఇవ్వడం మానేసి.. వారికి ఎలా తక్షణ న్యాయం అందించగలరో నిర్ణయం తీసుకోవాలని జనసేనాని సూచించారు. జీవితం చాలా విలువైనది, నిరాశతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని పవన్ సూచించారు. విద్యార్థులకు జనసేన అండగా ఉంటుందని భరోసా వపన్ ఇచ్చారు. తప్పిదాలకు కారణమైన బోర్డు అధికారులు, సాఫ్ట్ వేర్ సంస్థపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles