ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వీప దేశం శ్రీలంకలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఘోరకళితో స్థానికులు భీతావాహ పరిస్థితుల్లోకి నెట్టబడినా.. ఇంకా అదేశంలో బాంబు పేలుళ్లు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతోన్న శ్రీలంకేయులు ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడ బాంబు దాడులు పేలుతాయోనన్న భయాందోళనకు గురవుతున్నారు. నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) అనే అతివాద సంస్థ.. అంతర్జాతీయ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో కలసి ఈస్టర్ రోజున సృష్టించిన మారణకాండలో ఏకంగా 359 మంది చనిపోయిన విషయం తెలిసింది.
అదివారం ఉదయం చర్చీలను టార్గెట్ చేసి ఆరు బాంబులను, ఆత్మాహుతి దాడులతో పేల్చిన ఉగ్రవాదు.. అదే రోజు మధ్యాహ్నం రాజధాని కొలంబోలోని పర్యాటకులు నివసించే లగ్జరీ హోటళ్లను కూడా టార్గెట్ చేసి బాంబులను పేల్చారు, ఆ తరువాత ఒక బాంబును నిర్వీర్యం చేస్తుండగా పేలింది. ఇక బుధవారం శ్రీలంక రాజధాని కొలంబోలో ఓ సినిమా థియేటర్ వద్ద మరో బాంబు పేలింది. దుండగులు మోటారు బైక్‌లో పెట్టిన బాంబు పేల్చారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, పోలీసులు, భద్రతా బలగాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం లంక వాసుల్లో నెలకొంది.
ముఖ్యంగా కొలంబో లాంటి కీలక పట్టణాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. తాజాగా కొలంబోలో ఈరోజు మరోసారి పేలుడు సంభవించింది. భద్రతాబలగాలు రాజధానిలోని అడుగడుగున జల్లెడ పడుతుండగా, పుగోడ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద పేలుడు జరిగిందని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. ఈ ఘటనలో అధికారులు, ప్రజలు ఎవరూ గాయపడలేదన్నారు. ప్రజలెవరూ భయపడవద్దని సూచించారు. శ్రీలంకలో ఉగ్రపేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకూ 60 మంది అనుమానితులను అరెస్ట్ చేశామన్నారు.
శ్రీలంకలోని చర్చీలన్ని మూసివేత..
ఉగ్రమూకలు సృష్టించిన మారణకాండతో 359 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో శ్రీలంక క్రైస్తవ మతపెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చిల్లో ప్రార్థనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై సీనియర్ మతబోధకుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. చర్చిల వద్ద భద్రతను పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందులో భాగంగా రక్షణ ఏర్పాట్లను కల్పిస్తున్నామన్నారు. అందుకే కొద్దిరోజుల పాటు ఇటువైపుగా ప్రజలను అనుమతించబోమని స్పష్టం చేశారు. రక్షణ శాఖ సూచన మేరకే చర్చిలను కొద్దిరోజులు మూసివేస్తున్నామని తేల్చిచెప్పారు. ప్రజలంతా ఈ ఆదివారం ఇళ్ల దగ్గరే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. తాము చెప్పేవరకూ ప్రజలు చర్చిలకు రావొద్దని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more