Man touches livewire at railway station in Bengaluru రైలు ఎక్కి హైవోల్టేజి కరెంటు వైర్లు పట్టుకుని..

Man electrocuted after touching livewire at railway station in bengaluru

Viral video railway station, Majestic railway station suicide, Bengaluru railway station video, bangalore railway station suicide video, Bengaluru, karnataka, politics, Crime

Bengaluru's Majestic railway station was the site of a tragic incident as a man was electrocuted after he touched an electricity wire. In a viral video shared on social media, he can be seen dying instantly.

ITEMVIDEOS: రైలు ఎక్కి హైవోల్టేజి కరెంటు వైర్లు పట్టుకుని..

Posted: 04/25/2019 08:58 PM IST
Man electrocuted after touching livewire at railway station in bengaluru

రైలు పట్టాలను దాటితేనే అపరాధ రుసుము విధించే రైల్వే అధికారులు.. అదే రైలు ఎక్కినా.. అందులోనూ ఇంజన్ పైకి ఎక్కితే ఎలాంటి అభ్యంతరాలు తెలుపరా.? అసలు ఇలా ఎక్కేందుకు అధికారులు ఎవరినైనా అనుమతిస్తారా.? రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి తన పంచప్రాణాలను ఒక్క తాకుడుతో కోల్పోవాల్సి వచ్చింది. దీనికి ఏవరు బాధ్యులు. రైలు డ్రైవరా.? లేక స్టేషన్ మాస్టారా.? లేక మరెవరు. రైలు ఇంజన్ పైకి వ్యక్తులు ఎక్కుతున్నా అధికారులు, గార్డులు, స్టేషన్ సిబ్బంది ఏం చేస్తున్నారు. ఇప్పడీ ప్రశ్న కర్ణాటక రాజధాని బెంగళూరులోని స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే.. ఇవాళ పట్టపగలు ఓ వ్యక్తి రైలు ఇంజిన్ పైకి ఎక్కి హైటెన్షన్ కరెంటు వైర్లు పట్టుకోవడం సంచలనం కలిగించింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులతో చెప్పిన ఆ వ్యక్తి అన్నంత పనీ చేశాడు. స్టేషన్ లో అగివున్న రైలు పైకి ఎక్కాడు. రైలు ఇంజిన్ పైభాగానికి చేరుకుని, హైఓల్టేజ్ వైర్లను తాకాడు. దాంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పెద్ద విస్పోటనం కూడా వినిపించింది. ఆ వెంటనే పెద్దఎత్తున మంటలు రేగాయి. అంతే ఆ విద్యుత్ తీగలను పట్టుకున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి రైలుఇంజన్ పైనే పడి మరణించాడు.

ఈ దిగ్బ్రాంథికర దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. కాగా, రైలు ఇంజన్ పైకి ఎక్కుతున్న వ్యక్తిని కనీసం అభ్యంతరం తెలపని వ్యక్తులు, అడ్డుకోవాల్సిన ప్రజలు.. ఆయన రైలు పైకి ఎక్కినప్పటి నుంచి ఏం చేస్తాడా అంటూ అందరూ తమ సెల్ పోన్ లకు పనిచెప్పారు. ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ దిగ్భ్రాంతికర ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతడి మానసిక స్థితిపై పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మతిస్థిమితం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles