కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ లను నిర్భంధించారన్న కేసులో అభియోగాలను ఎదుర్కోంటున్న కొండా విశ్వేశ్ర్వర్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించారు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాదులు క్రితం రోజునే హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇవాళ వారు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.
అయితే నాంపల్లి న్యాయస్థానం మాదిరిగానే హైకోర్టులో కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను తిరస్కరిస్తుందా..? లేక పిటీషన్ ను స్వీకరిస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే. కాగా, రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన పోలీసులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే ఈ కేసును బనాయించారని ఆయన తరపు న్యాయవాదులు అరోపిస్తున్నారు. ఎన్నికల నియమావళి అమల్లో వున్న క్రమంలో ఎవరైనా పోలీసులను ఎదురిస్తారా..? వారిని అక్రమంగా బంధిస్తారా.? ఇది కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై రాజకీయ కుట్రతో బనాయించిన కేసు అని పేర్కోంటున్నారు. ఇదిలావుండగా, కొండా విశ్వేశ్వర్ రె్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కొండా విశ్వేశ్వర్‌రెడి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేశారు. ఎన్నికలకు రెండ్రోజుల ముందు ఆయన బంధువు, అడ్వకేట్ సందీప్‌రెడ్డి రూ.10లక్షలు కారులో తరలిస్తూ హైదరాబాద్ లో పోలీసులకు పట్టుబట్టారు. ఈ డబ్బు విశ్వేశ్వర్‌రెడ్డిదని, ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్నట్లు తేలడంతో పోలీసులకు ఆయనకు నోటీసులు జారీచేశారు. నేరుగా నోటీసులు అందించేందుకు గచ్చిబౌలి ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఆయన నివాసానికి వెళ్లగా వారిద్దరినీ కొండా అనుచరులు నిర్బంధించారు.
ప్రభుత్వాధికారుల విధులకు భంగం కలిగించినందుకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేశారు. దీనికి తోడు వారం రోజులుగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. దీంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ కొట్టేసింది. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more