UAE birth certificate to inter-faith Indian couple's child హిందూ-ముస్లిం దంపతుల బిడ్డకు తొలి బర్త్ సర్టిఫికేట్..

Uae gives birth certificate to girl born to hindu father and muslim mother

UAE,gives birth certificate to girl born,to Hindu father and Muslim mother,Year of Tolerance,Kiran Babu and Sanam Saboo Siddique

UAE government has given birth certificate to a nine-month old girl who was born to an Indian Hindu father and a Muslim mother, setting aside the country’s marriage rules for expatriates during the Year of Tolerance,

హిందూ-ముస్లిం దంపతుల బిడ్డకు తొలి బర్త్ సర్టిఫికేట్..

Posted: 04/29/2019 03:59 PM IST
Uae gives birth certificate to girl born to hindu father and muslim mother

ఎంతటి కఠిన చట్టాలైనా ప్రేమకు లొంగిపోతాయని మరోమారు నిరూపితం అయ్యింది. ప్రేమ ప్రతీరూపానికి అప్పటివరకు అడ్డంకులుగా వున్న కఠిన చట్టాలు కూడా సూర్యరశ్మి సోకిన మంచుతెన్నుర మాదిరిగా కరిగిపోతాయని ఈ ఘటన ద్వారా మరోమారు నిరూపితమైంది. అది అత్యంత కఠిన చట్టాలను అమలుచేసే దేశం. పలు శిక్షలు ఏకంగా బహిరంగంగానే నిర్వహించే దేశమది. ఇలాంటి దేశం కూడా ప్రేమపాశం ఎదుట తలొగ్గక తప్పలేదు. ఇందుకోసం ఏకంగా తమ దేశ నిబంధనలను పక్కనబెట్టి.. తమ రాజ్యాంగంలో కూడా మార్పులు చేసింది.

దీంతో ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతికి పుట్టిన చిన్నారికి బర్త్ సర్టిఫికెట్ లభించింది. యూఏఈ దేశ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే, యూఏఈ చట్టాల ప్రకారం, ముస్లిం మతస్తుడు ముస్లిమేతర మహిళను పెళ్లి చేసుకోవచ్చు కానీ, ముస్లిం మహిళ ముస్లిమేతర వ్యక్తిని వివాహం చేసుకునేందుకు వీలు లేదు. కానీ అలా జరిగిన ఓ ఘటన ఓ జంటను భార్యభర్తలను చేసింది. వారికి పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికేట్ మంజూరులో తలెత్తిన అన్ని అడ్డంకాలు తొమ్మిది నెలల తరువాత కానీ వీడిపోయి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి.

ఇండియాకు చెందిన కిరణ్ బాబు, సన్ సాబూలు 2016లో కేరళలో వివాహం చేసుకుని, షార్జాలో నివాసం ఉంటున్నారు. వారికి గత సంవత్సరం జూలైలో కుమార్తె జన్మించగా, అనామ్తా ఏస్ లిన్ కిరణ్ అని పేరు పెట్టుకున్నారు. చట్టాల కారణంగా పాపకు జన్మ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు అధికారులు అంగీకరించలేదు. ఈ దంపతులు కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఇక వారు ఇండియాకు వెళ్లేందుకు చూడగా, పాపకు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ లభించలేదు. దీంతో కిరణ్ మరోమారు కోర్టును ఆశ్రయించగా, మానవతా దృక్పథంతో బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అనుమతిస్తున్నామని కోర్టు పేర్కొంది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles