మేనమామ చేతిలో తన అక్క మోసపోయిందని.. అతడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన చెల్లికి చట్టం ముసుగులో వున్న కామాంధుడు కాటు వేసే ప్రయత్నం చేశాడు. తన అక్కకు జరిగిన అన్యాయమే తనకు ఎదురువుతుండంతో తెలివిగా అలోచించిన చెల్లి.. కామాంధుడ్ని చర్యలను, మాటలను తన ఫోన్ లో రికార్డు చేసి.. వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బాధితులకు అండగా నిలిచి చట్ట ప్రకారం వారికి కావాల్సిన న్యాయం చేయాల్సిన ఓ కామాంధ కాకిపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
న్యాయం చేయాలంటూ బాధిత అక్కతో పాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చెల్లితో అసభ్యంగా వ్యవహరించి అమెను లైంగికంగా వేధించిన సిఐపై ఉన్నతాధికారి వేటు వేశారు. బాధితురాలి పిర్యాదుపై కేసు నమోదు చేయకుండా.. అమె చెల్లితో ‘‘నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు. మీ అక్క కంటే నువ్వే బాగున్నావు. ఒకసారి బీచ్‌కు వస్తే మాట్లాడుకుందాం. నిన్ను ప్రేమించాలని ఉంది. ఎంతసేపూ మీ అక్క కుటుంబమేనా? నీ గురించి ఆలోచించవా?’’ అంటూ వేధించాడు. సీఐ మాటలను రికార్డు చేసిన యువతి.. పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా దృష్టికి తీసుకెళ్లడంతో సీఐని ఆయన సస్పెండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా జిమ్మయ్యవలస మండలంలోని లక్ష్మీపురానికి చెందిన పల్లా కృష్ణ కుమారి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తూ ఎంవీపీ కాలనీలో ఉంటోంది. తనను పెళ్లి చేసుకుంటానని అమెను నమ్మించిన అమె మేనమామ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన విజయభాస్కర్ ఆమెను లోబరుచుకున్నాడు. ఆ తరువాత మాట తప్పి.. వేరొకరితో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి పేరుతో మోసం చేసిన మేనమామపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ఈ నెల 27న తన సోదరితో కలిసి పోలిస్ స్టేషన్ కు వెళ్లింది.
తన మేనమేమపై తన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయాల్సిన సీఐ సన్యాసి నాయుడు ఆ పని చేయకుండా నాన్చుతూ.. కృష్ణ కుమారి సోదరిని చూసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. తాను అమెను ప్రేమిస్తున్నానని, తనను కూడా ప్రేమించాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. తమ వివరాలన్నీ తెలుసుకుని ఇలా వేధింపులకు గురిచేయడం బావ్యం కాదని అమె కోరినా.. సన్యాసి నాయుడు వినలేదు. దీంతో సీఐ ఫోన్ చేసి మాట్లాడిన మాటలను కాల్ రికార్డింగ్ చేసిన బాధితురాలు విశాఖపట్నం సీపీ మహేశ్ చంద్ర లడ్డాకు ఫిర్యాదు చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన సీపీ సన్యానినాయుడుపై సస్పెన్షన్ వేటు వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more