గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతవాసులకు కంటిమీద కునుకు కరువయ్యేలా చేసిన ఫెను తుఫాను ‘ఫణి’ అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం వద్ద తీరం దాటి.. ఒడిశాలోని పూరి వైపు దూసేకెళ్లింది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ వైపు పయనం కానుందని భారత వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. అయితే ఈ క్రమంలో పెను తుపాను కాస్తా బలహీనపడి శాంతిస్తుందని భారత వాతావరణ కేంద్రం అధికారి మృత్యుంజయ మోహపాత్రో పేర్కోన్నారు. కాగా అంధ్రప్రదేశ్ లోని మూడు జిల్లాలపై దీని ప్రభావం పడిందని ఆయన తెలిపారు.
పెను తుఫాను తీరం దాటే సమయంలో 150 నుంచి 200 మేర వేగంతో వీచిన గాలులు పెను బీభత్సం సృష్టించాయని అన్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయని, అనేక పూరిళ్లు గాలులకు నెలకూలిపోయాయి. అనేక విద్యుత్ స్థంబాలు, పలు చోట్ల టవర్లు, కూడా నెలకూలాయి. దీంతో గత వారం రోజులుగా శ్రీకాకుళం వాసుల్ని వణికించిన ఫణి తుపాన్ ప్రభావం నుంచి జిల్లా బయట పడిందని, జిల్లాకు దూరంగా తుపాన్ తీరం దాటడంతో పెనుముప్పు తప్పినట్టేనని ఆ జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు. భారీ వర్షాలు కురిసినందున నదులు, వాగులకు వరద ప్రమాదం ఉందని, పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గురువారం రాత్రంతా కలెక్టరేట్లోని కంట్రోల్ రూంలోనే ఉండి పరిస్థితిని గమనించిన కలెక్టర్ ఈరోజు ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆర్టీజీఎస్ హెచ్చరించిన విధంగానే తుపాన్ గమనం సాగిందని చెప్పారు. తీరప్రాంత మండలాలపై తుపాన్ కొంత ప్రభావం చూపిందని చెప్పారు. ఇచ్ఛాపురంలో 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, మూడు గుడిసెలు, పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలినట్లు సమాచారం అందిందని చెప్పారు. విద్యుత్ స్తంభాల తక్షణ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
కంచిలి మండలంలో 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. సెల్ కంపెనీల టవర్లను అనుసంధానం చేయించి ఒక కంపెనీ టవర్ దెబ్బతిన్నా, మరో దాన్నుంచి సిగ్నల్స్ అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వల్ల సమాచార వ్యవస్థలో ఎటువంటి అంతరాయం తలెత్తలేదని స్పష్టం చేశారు. తీరం సమీపంలో ఉన్న గ్రామాలపై తుపాన్ ప్రభావం అధికంగా ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడి ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. తుపాన్ తీరం దాటక ముందు, తర్వాత భారీ వర్షాలు కురిసిన కారణంగా వంశధార, బాహుద నదుల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more