దేశరాజధాని.. నిత్యం పరదేశవాసులు పలు పనులుపై సంచరించే ప్రాంతం.. మన దేశ ఘనత ఎలాంటిదో.. మన దేశ సంస్కృతి, సంప్రదాయం ఎలాంటిదో కూడా తేటతెల్లం చేసే ప్రాంతం.. ఇలాంటి ప్రాంతంలో మన అడపడచులకు భద్రత లేదని.. అక్కడ జరుగుతున్న ఘటనలే స్పష్టం చేస్తున్నాయి. నిర్భయ ఘటన చోటుచేసుకని ఏడేళ్లు గడిచినా. ఆడపడచుల విషయంలో ప్రభుత్వం మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో.. మహిళలు, యువతుల రక్షణ కల్పించడంలో మాత్రం విఫలం అయ్యిందన్న విమర్శలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.
ఇదిలావుంటే అదే దేశరాజధాని వీధుల్లోని రోడ్లపై ఓ ప్రేమ జంట చేసిన రొమాన్స్ పరాకాష్టకు చేరుకుంది. సభ్యతా, సంస్కారం మరచి నడిరోడ్డుపై అదరచుంభనాలతో వెళ్లడం అదే దారిలో వెళ్లే అనేక మందికి ఇబ్బందికరంగా పరిణమించింది. వారిని చూస్తూ పట్టించుకోకుండా వెళ్లే వారితో పెద్ద సమస్య లేదు కానీ వారినే చూస్తూ.. తమ వాహనాలను ఎటు నడుపుతున్నారో తెలియని వారితో ఇతర వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ కు కూడా అంతరాయం ఏర్పడింది.
అసలేం జరిగిందంటే.. ఢిల్లీ రోడ్లపై.. బైక్‌పై వెళ్తూనే ఆ జంట ముద్దుల్లో మునిగిపోయింది. చుట్టూ జనాలు ఉన్నారని, తాము బైక్ రైడింగ్ లో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి ముద్దులాటలో మునిగిపోయింది. ఓ ఐపీఎస్ అధికారి వారి రొమాన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. మోటారు వెహికల్ చట్టంలో కొన్ని మార్పులు తేవాల్సి ఉందంటూ ఆయన చేసిన ట్వీట్‌పై కామెంట్లు హోరెత్తుతున్నాయి.
పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ సమీపంలో జరిగిందీ ఘటన. యువతి బైక్ పెట్రోల్ ట్యాంకుపై కూర్చుంటే యువకుడు డ్రైవ్ చేస్తూనే సరస సల్లాపాల్లో మునిగిపోయాడు. లిప్ లాక్ లతో ఇద్దరూ రెచ్చిపోయారు. యువకుడు బైక్‌ను నియంత్రిస్తూనే తన ప్రియురాలితో శృంగారంలో మునిగితేలుతూ వాహనాన్ని నడపడంతో వెనుక వాహనాలకు ఇబ్బందులు తలెత్తాయి. సాయంత్రం వేళ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి జంకుగొంకు లేకుండా వారిద్దరూ రొమాన్స్‌లో మునిగిపోవడాన్ని చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more