psycho killer is in love relationship with vemulawada girl నరహంతకుడిలో నయా కోణం.. వేములవాడ యువతితో ప్రేమాయణం..

Psycho killer marri srinivas reddy is in love relationship with vemulawada girl

Yadadri murder case, srinivas reddy house set afire, Kalpana rape, kalpana missing, kalpana dead body, kalpana skelton, manisha murder, manisha dead body, manisha skeleton, sravani murder, sravani dead body, sravani rape and murder, srinivas reddy, bike mechanic, hazipur, bommalaramaram, yadadri district, crime

In a shocking development in Hazipur psycho killer marri srinivas reddy case, police has noticed that he is in love relationship with vemulawada girl and both decided to marry soon.

నరహంతకుడిలో నయా కోణం.. వేములవాడ యువతితో ప్రేమాయణం..

Posted: 05/04/2019 04:20 PM IST
Psycho killer marri srinivas reddy is in love relationship with vemulawada girl

హాజీపూర్ లో వరుస అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి ఫేస్ బుక్ లో వందలాది మంది స్నేహితులు ఉండటం విశేషం. మొత్తం 327 మంది ఫేస్ బుక్ స్నేహితులు ఉండగా... వీరిలో 60 మందికి పైగా అమ్మాయిలే ఉన్నారు. వీరిలో ఓ యువతితో నరహంతకుడు అత్యంత సన్నిహితంగా తీసుకున్న సెల్ఫీలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక ఫోటోనే శ్రీనివాస్ రెడ్డి తన ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. ఆ యువతి శ్రీనివాసరెడ్డి ప్రియురాలిగా పోలీసుల విచారణలో తేలింది. అమ్మాయిలపై మానవరూపంలోని పైశాచిక మగంగా తెగబడే నిందితుడిలో ఈ కోణంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.

ఆడవారిపై తన పశువాంఛ తీర్చుకున్న తర్వాత కర్కశంగా అంతమొందించిన హాజీపూర్ సైకో కిల్లర్‌ మర్రి శ్రీనివాస్‌ రెడ్డికి సంబందించిన మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నరగా తనతో చనువుగా ఉంటున్న ఓ యువతి విషయంలో మాత్రం అతను ఎలాంటి సైకో లక్షణాలు చూపకుండా ప్రవర్తించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. ముగ్గురు అమ్యాయిలపై అఘాయిత్యానికి తెగబడిన ఈ సైకో కిల్లర్ తన ప్రియురాలితో మాత్రం భిన్నంగా ప్రవర్తించడంపై పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.

హాజీపూర్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ఏడాదిన్నర కాలంగా ఓ యువతితో చనువుగా ఉంటున్నాడు. ఆ యువతితో కలిసి దిగిన ఫోటోలను ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఆ అమ్మాయికి సంబంధించిన వివరాల గురించి పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన యువతిగా గుర్తించారు. లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్ రెడ్డి వేములవాడలోనూ కొంత కాలం పనిచేసినట్లు ఆ క్రమంలో సదరు యువతితో ప్రేమలో పడినట్టు త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనతో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిందని తెలుస్తోంది.

అమ్మాయిలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన హాజీపూర్ సైకో కిల్లర్.. ఆ యువతితో మాత్రం అంత అదుపుగా ఎలా ఉండగలిగాడనేది చర్చనీయాంశంగా మారింది. దీన్ని పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పోలీసులు దర్యాప్తులో స్పష్టం చేసినట్లు తనను గ్రామంలోని అవమానించి.. చెప్పుతో కోట్టినందుకు మాత్రమే హాజీపూర్ గ్రామంలోని అమ్మాయిలనే టార్గెట్ గా చేసుకుని అత్యాచారం, హత్య చేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాడా.. అని పోలీసుల విచారణలో తేలాల్సివుంది. కాగా శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని రాచకోండ పోలీసులు భువనగిరి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sravani  manisha  Kalpana  srinivas reddy  bike mechanic  keesara  hazipur  bommalaramaram  yadadri district  crime  

Other Articles