తెలంగాణ ఇంటర్ ఫలితాలలో చోటుచేసుకున్న అవకతవకలను సరిచేస్తామని చెప్పిన బోర్డు.. ఇప్పటికీ తమ నిర్ణయాన్ని వెల్లడించని కారణం చేత విద్యార్థుల మరణాలు కూడా ఆగడం లేదు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిర్లక్ష్యానికి మరో విద్యార్థిని బలైంది. తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 25 మంది విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్షధోరణితో బలవన్మరణాలకు పాల్పడగా, ఇవాళ మరో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని కూడా పరమపదించింది. అధికారుల తప్పిదాలకు విద్యార్థులు.. తమ అమూల్యమూన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తుండడం.. రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో కొన్ని రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో ఈ విషాదం జరిగింది. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల రమేష్, సునీత దంపతుల పెద్ద కుమార్తె సాయిల మానస(17) ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థిని. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతోంది. మెరిట్ స్టూడెంట్ అయిన మానస.. ఏప్రిల్ 18న వచ్చిన ఇంటర్ ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో మానస ఫెయిలైంది.
10వ తరగతిలో 8 జీపీఏ గ్రేడ్ సాధించి గ్రామస్థుల నుంచి అభినందనలు అందుకున్న అమె.. తాను ఇంటర్ మొదటి సంవత్సరంలో నాలుగు సబెక్టులు తప్పానని తెలిసి.. దానిని జీర్ణంచుకోలేక మానసిక అందోళనకు గురైంది. తాను ఫెయిల్ కావడం తట్టుకోలేకపోయిన అమె. అదే రోజు రాత్రి ఇంట్లో ఉన్న కలుపు నివారణ మందు తాగింది. వెంటనే తల్లిదండ్రులు మానసని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
ఐదు రోజులపాటు వైద్యులు చికిత్స అందించారు. లాభం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని సూపర్ స్పెషల్ హాస్పిటల్లో చేర్పించారు. 20 రోజుల నుంచి చికిత్స పొందుతున్న మానస ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె తమకు దూరమైందని తల్లిదండ్రులు విలపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more