తెలంగాణలో మరోసారి థియేటర్ టికెట్ ధరల పెంపు విషయంపై పెద్ద దుమారం రేగింది. ఈ నెల 9 వ తేదీన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లోనే మైలురాయిలా నిలిచే ఆయన 25వ చిత్రం..రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో రోజుకు ఐదు షోలతో పాటు టికెట్ల ధరల పెంపుకు కూడా ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్వయంగా రాష్ట్ర సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. థియేటర్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో ఆ శాఖా మంత్రే విస్మయానికి గురయ్యారు.
మహర్సి సినిమా విడుదల నేపథ్యంలో తాము ఎవరికీ ఎలాంటి అనుమతులు మంజూరు చేయలదేని తెలిపారు. ఇక ఐదు షోలు వేసుకునేందుకు కూడా ఎవరూ ప్రభుత్వ అనుమతి పోందలేదని ఆయన స్వయంగా వెల్లడించడంతో ఈ సినిమా రిలీజ్ కి కొన్ని గంటల ముందు వివాదంలో చిక్కుకుంది. థియేటర్ యజమానుల తీరు వివాదానికి దారితీసింది. ప్రభుత్వం పేరు చెప్పి ఏకపక్షంగా టికెట్ల ధరలు పెంచడం రచ్చగా మారింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
కాగా, సినిమా విడుదల నేపథ్యంలో సినిమా నిర్మాతలు హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారని సమాచారం వెలుగుచూసింది. రెండు వారాల పాటు ప్రతిరోజు ఐదు షోలతో పాటు టికెట్ ధరల పెంపుకు కూడా హైకోర్టు నిర్మాతలకు అనుమతిని మంజూరు చేసిందని సమాచారం. అయితే ఈ విషయంపై మంత్రి తలసాని సినిమా థియేటర్ యాజమాన్యాలపై ఫైర్ అయ్యారు. హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా టికెట్ ధరలు పెంచడం ఏంటని ఆయన యాజమాన్యాలను నిలదీశారు.
రాష్ట్రోన్నత న్యాయస్థానం ఇచ్చిన అనుమతుల కాఫీలను నిర్మాతలు, సినిమా థియేటర్ల యాజమాన్యాలు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారా లేదా అని ఆరా తీశారు. టికెట్స్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, దీనిపై లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్టు తలసాని తెలిపారు. టికెట్ల ధరల పెంపు అనేది ప్రభుత్వ నిర్ణయం అని మంత్రి స్పష్టం చేశారు. 79 థియేటర్లు టికెట్ ధరలు పెంచినట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more